కన్నడ ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన రష్మిక మందన్న.. ఇలా మాట్లాడటం కరెక్టేనా?

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ( Celebrities )ఏమి మాట్లాడాలి అన్నా కూడా కాస్త భయపడుతున్నారని చెప్పాలి.

ఏమి మాట్లాడినా కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు.

దీంతో సోషల్ మీడియాతో పాటు అభిమానుల లోకి వచ్చినప్పుడు కూడా చిన్న విషయాలు మాట్లాడడానికి కూడా ఆలోచిస్తున్నారు.అయితే ఎంత జాగ్రత్తగా మాట్లాడినా కూడా కొన్ని కొన్ని సార్లు నోరు జారడం అన్నది సహజం.

చిన్న చిన్న పదాలు మిస్టేక్ అవ్వడం అనేది కామన్.కొన్ని కొన్ని సార్లు దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉండడంతో పాటు చాలా దూరం వెళుతూ ఉంటాయి.

అది కాంట్రవర్సీకి కూడా దారి తీయవచ్చు.

Rashmika Gets Trolled For Saying Im From Hyderabad, Rashmika, Rashmika Mandanna,
Advertisement
Rashmika Gets Trolled For Saying Im From Hyderabad, Rashmika, Rashmika Mandanna,

ఇప్పుడు రష్మిక మందన( Rashmika Mandana ) చేసిన కామెంట్స్ కూడా కన్నడ అభిమానులను హర్ట్ చేసింది.అసలేం జరిగిందంటే.ఇటీవలే చావా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ నేను హైదరాబాద్ నుంచి వచ్చానని, ఇక్కడ ఇంత మందిని చూశాక మీ కుటుంబంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కన్నడ మిత్రులకు కోపం వచ్చేసింది.దాంతో ట్విట్టర్ వేదికగా ట్రిగ్గరింగ్ ట్వీట్లు పెట్టి నిలదీస్తున్నారు.ఎందుకంటే రష్మిక సొంత రాష్ట్రం కర్ణాటక.

తొలి అవకాశం వచ్చింది కన్నడ సినిమా కిరిక్ పార్టీలో.దర్శకుడు నటుడు రక్షిత్ శెట్టి ( Actor Rakshit Shetty )తో నిశ్చితార్థం అయ్యాక పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం గురించి అప్పట్లోనే చాలా కామెంట్స్ వచ్చాయి.

Rashmika Gets Trolled For Saying Im From Hyderabad, Rashmika, Rashmika Mandanna,

తెలుగులో హిట్లు పడ్డాక మాతృ బాషను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శలు కూడా వినిపించాయి.అయినా అమ్మడు అవేవి పట్టించుకోలేదు.ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి సాంకేతికంగా రష్మిక బెంగళూరు నుంచి వచ్చినట్టు అవుతుంది తప్ప హైదరాబాద్ కాదనేది శాండల్ వుడ్ ఫ్యాన్స్ వెర్షన్.

తీహార్‌లోని మగ ఖైదీల బ్లాక్‌లో యువతి.. కళ్లారా ఏం చూసిందంటే?
హైపర్ ఆది నన్ను ఫ్లర్ట్ చేశాడు.. వైరల్ అవుతున్న దీపు నాయుడు షాకింగ్ కామెంట్స్!

ఇందులో లాజిక్ లేదని చెప్పలేం.అవును మరి మూలాలు గుర్తు పెట్టుకోవాలనేది ఇతరుల అభిప్రాయం.ఏది ఎలా ఉన్నా రష్మిక మందన్న ఇవన్నీ పట్టించుకోదు కానీ తను మాత్రం ఫుల్ హైలో ఉంది.

Advertisement

యానిమల్, పుష్ప 2 ది రూల్ రెండు బ్లాక్ బస్టర్స్ అయ్యాక చావాకు ముంబై సర్కిల్స్ లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.వసూళ్లు భారీగా ఉన్నాయి.

ఇదే మూమెంట్ ని కొనసాగిస్తే మాత్రం రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి.

తాజా వార్తలు