అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది.అధికారుల తీరును వ్యతిరేకించిన టీడీపీ కౌన్సిలర్ చెప్పుతో కొట్టుకున్నాడు.
తనను నమ్ముకున్న వారికి కూడా న్యాయం చేయలేకపోతున్నానంటూ 20వ వార్డు కౌన్సిలర్ రామరాజు తన చెప్పుతో తానే కొట్టుకున్నట్లు తెలుస్తోంది.తన వార్డులో పనులకు మున్సిపల్ కమిషనర్ సహకరించడం లేదని రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
చెత్తను తొలగించమని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.నమ్మి ఓటేసిన వారికి న్యాయం జరగడం లేదని కన్నీరు పెట్టుకున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే మరి కొంతమంది నేతల మధ్య వాగ్వివాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.