సాధారణంగా స్వచ్ఛంద సంస్థలకు ధనికులు చాలా డబ్బును డొనేట్ చేస్తుంటారు.అయితే తాజాగా యూఎస్ఎలోని( USA ) ఒక స్వచ్ఛంద సంస్థ ఒక ప్రముఖ దర్శకుడి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన నైక్ బూట్లను విరాళాన్ని అందుకుంది.
ఈ స్వచ్ఛంద సంస్థ త్వరలో బూట్లను వేలంలో విక్రయించనుంది.ఈ స్వచ్ఛంద సంస్థను పోర్ట్‌ల్యాండ్ రెస్క్యూ మిషన్( Portland Rescue Mission ) అని పిలుస్తారు.
ఇది నిరాశ్రయులైన లేదా డ్రగ్స్‌కు బానిసలైన వ్యక్తులకు సహాయం చేస్తుంది.
అయితే ఈ సంస్థకు ఒక జత గోల్డెన్ నైక్ షూలను( Golden Nike Shoes ) డొనేట్ చేశారని తెలిసి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు.
తర్వాత దీని గురించి కొంత పరిశోధన చేసి, షూలను నైక్‌లో పనిచేస్తున్న ప్రముఖ షూ డిజైనర్ టింకర్ హాట్‌ఫీల్డ్( Tinker Hatfield ) రూపొందించినట్లు గుర్తించారు.అకాడమీ అవార్డును గెలుచుకున్న దర్శకుడు స్పైక్ లీ( Spike Lee ) కోసం అతను ఈ బూట్లు తయారు చేశాడు.2019లో జరిగిన ఆస్కార్ వేడుకలకు లీ బూట్లు ధరించారు.ఈ షూలను “నైక్ ఎయిర్ జోర్డాన్ 3 రెట్రో స్పైక్ లీ ఆస్కార్స్” అని పిలుస్తారు.వాటి వాల్యూ 15,000 – 20,000 డాలర్లు (రూ.12 – రూ.16 లక్షలు).
సిబ్బంది హాట్‌ఫీల్డ్‌ను సంప్రదించి, బూట్లు ఒరిజినల్‌యేనా అని అడిగారు.హాట్‌ఫీల్డ్ రియల్ వేనని కన్ఫామ్ చేశారు.అలానే, ఆ బూట్లు చివరకు స్వచ్ఛంద సంస్థలో చేరినందుకు హ్యాపీగా ఫీల్ అయినట్టు తెలిపాడు.
అయితే ఆ బూట్లను స్వచ్ఛంద సంస్థకు ఎవరు విరాళంగా ఇచ్చారో తనకు తెలియదన్నారు.స్వచ్ఛంద సంస్థ నిధుల సమీకరణలో భాగంగా వేలంలో బూట్లు విక్రయించాలని నిర్ణయించుకుంది.
వారు ఫైన్ ఆర్ట్, ఇతర వస్తువులను విక్రయించే సోథెబైస్ కంపెనీని సంప్రదించారు.ఆన్‌లైన్‌లో బూట్లను వేలం వేయడానికి సోత్‌బైస్ అంగీకరించింది.డిసెంబర్ 11న ప్రారంభమైన వేలం డిసెంబర్ 18న ముగుస్తుంది.ఇప్పటివరకు అత్యధికంగా 7,000 డాలర్లు (సుమారు రూ.6 లక్షలు) పలికింది.బూట్లు బంగారంతో పూత పూసి ఉంటాయి హై క్వాలిటీ తయారయ్యాయి.
గోల్డెన్ కోటింగ్ నైక్ లోగో, ఏనుగు ముద్రణ, బూట్ల ఇతర భాగాలను కవర్ చేస్తుంది.