రణ్‌వీర్ సింగ్ మానసిక రోగి.. నగ్న ఫోటోలపై సామాజిక కార్యకర్తలు ఫైర్!

బాలీవుడ్ యంగ్ హీరో అయినా రణ్‌వీర్‌ సింగ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న రణ్‌వీర్‌ సింగ్‌ కు, విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.ఇకపోతే రణ్‌వీర్‌ సింగ్‌ తరచుగా ఎక్కువగా తన డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో వార్తలు నిలుస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.కాగా ఇప్పటికే సోషల్ మీడియాలో పలుసార్లు రణ్‌వీర్‌ సింగ్‌ డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో ట్రోలింగ్స్ జరగగా తాజాగా మరొకసారి న్యూడ్ ఫోటోలతో రెచ్చిపోయాడు.

తాజాగా రణ్‌వీర్‌ సింగ్‌ చేసిన ఒక న్యూడ్ ఫోటోషూట్ ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతోంది.ఇక మీమర్స్ అయితే మీమ్స్ తో,ఫన్నీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

కొంతమంది మాత్రం రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్ ఫోటో షూట్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఇదే విషయం గురించి రణ్‌వీర్‌ సింగ్‌ పై ట్రోలింగ్ చేయడంతో పాటు మధ్యలో దీపికాను కూడా ఇన్వాల్వ్ చేస్తూ నువ్వైనా నీ భర్తకు చెప్పొచ్చు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్‌ పై సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రణ్‌వీర్ సింగ్‌ ఒక మానసిక రోగి అంటూ బ్యానర్లు కట్టారు.నూలు పోగు కూడా లేకుండా ఉన్న రణ్‌వీర్ సింగ్‌ను చూసిన వారు దుస్తులు సేకరించి అతనికి పంపారు.చూస్తుంటే ఈ వివాదం ఇంకా కొనసాగేలా ఉందని తెలుస్తోంది.

కాగా పేపర్‌ మ్యాగజైన్‌ కోసం రణ్‌వీర్ నగ్నంగా ఫోజులిచ్చిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్ ఫోటోషూట్ పై జరుగుతున్న వార్తలు, వాదనలు ప్రతి వాదనలు వింటుంటే ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.