Jabardasth Mahesh: ఎన్టీఆర్ చెప్పిన మాట లైఫ్ లో మరిచిపోలేను.. జబర్దస్త్ మహేష్ ఏం చెప్పారంటే?

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ మహేష్( Comedian Mahesh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జబర్దస్త్ లో కిరాక్ ఆర్పి టీం లో చేస్తూ ఆర్పి పై పంతులు వేస్తూ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్.

చాలామంది జబర్దస్త్ మహేష్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ రంగస్థలం మహేష్ అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.బుల్లితెరపై చిన్నచిన్న కామెడీ స్కిట్లు చేసుకుంటూ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ ఆ తర్వాత వెండితెర పై అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నాడు.

హీరో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో( Rangasthalam ) భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా తర్వాత మహేష్ ని అందరూ రంగస్థలం మహేష్ అని పిలవడం మొదలుపెట్టారు.సినిమాలలో ఎక్కువగా హీరోలకు ఫ్రెండ్ క్యారెక్టర్ లలో నటించి మెప్పించాడు రంగస్థలం మహేష్.ఇప్పటివరకు తెలుగులో రంగస్థలం, గుణ 369, పాగల్, ప్రతిరోజు పండగే, బ్లఫ్‌ మాస్టర్‌, మహానటి, శ్రీనివాస కల్యాణం,118, బుర్రకథ, నిన్ను తలచి, వరుడు కావలెను, డర్టీహరి, దాస్ కా ధమ్కీ తదితర సినిమాల్లో నటించాడు.

Advertisement

కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి ప్రశంసలు అందుకున్నాడు.ప్రస్తుతం బుల్లితెరకు పూర్తిగా దూరమైన మహేష్ వెండితెరపై వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ ఎన్టీఆర్( NTR ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.ఎన్టీఆర్ అన్న చాలా బాగా మాట్లాడుతారు.

ఒకరోజు సుకుమార్ గారి పాప పుట్టినరోజు ఫంక్షన్ కి వెళ్ళాను.అప్పుడు నాకు కనిపించి ఒరేయ్ లేట్ అయినా పర్వాలేదు.

మంచి మంచి క్యారెక్టర్లే చెయ్యి.నువ్వు మంచి ఆర్టిస్ట్ వి తొందరపడకు అని నాకు జాగ్రత్తలు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

ఆ విషయాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను అని సంతోషంగా చెప్పుకొచ్చారు మహేష్.

Advertisement

తాజా వార్తలు