Venkatesh: ఒక్క సిరీస్ తో మూడు దశాబ్దాల వెంకీ పరువు ఢమాల్

35 ఏళ్లుగా సినిమా ఫీల్డ్ లో ఉంది, 62 ఏళ్ళ వయసు ఉన్న వెంకటేష్ కి(Venkatesh) ఒక్కసారిగా ఏమైంది అని అయన అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.

చాల రోజులుగా ఇండస్ట్రీ లో ఒక్క వెంకీ మాత్రమే తన వయసుకు తగ్గట్టుగా పాత్రలను ఎంచుకుంటూ వెళ్తున్నాడు అని అందరి హీరోలకు ఒక ఉదాహరణ వేలెత్తి చూపాం.

కానీ ఒకే ఒక్క సిరీస్ తో ఇన్నేళ్ళుగా తాను కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తం పోయింది.అదే రానా నాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్.

అన్న కొడుకు రానా తాను కలిసి చేసిన ఈ సిరీస్ లో లెక్కలేనన్ని భూతులు ఉన్నాయ్.మూడు దశాబ్దాలుగా ఎంతో మంది మహిళా అభిమానులను సంపాదించుకున్న ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఇంత దారుణమైన భూతు పదాలను ఎలా ఎంకరేజ్ చేసాడో అర్ధం కాలేదు.

పైగా ఇందులో కొడుకు పాత్రలో రానా నటించాడు.రానా(Rana Daggubati) సంగతి కాసేపు పక్కన పెడితే వెంకీ కి ఉన్నపళంగా ఇలాంటి ఒక భూతు సిరీస్ చేయాల్సిన అవసరం ఏమచ్చిందో అర్ధం కావడం లేదు.

Advertisement

సిరీస్ విడుదల అవ్వగానే వెంకటేష్, రానా పై ఉన్న సదభిప్రాయం తో మంచి గా రివ్యూ లు ఇచ్చిన సగటు వెంకటేష్ అభిమానులకు మాత్రం ఇది ఎక్కకపోవచ్చు.

ఇక ఆ బాషా ప్రయోగం మరి దారుణం.కుటుంబం తో కలిసి ఈ సిరీస్ ని చూడటం జరిగే పని కాదు.ఇప్పటికే టాలీవుడ్ లో అన్ని సినిమాలను తెలుగు లో తీసి పాన్ ఇండియా పేరు తో హిందీ లో వదులుతున్నారు.

కానీ ఈ సిరీస్ విషయానికి వస్తే హిందీ లో తీసి తెలుగు లో విడుదల చేసినట్టుగా అనిపించింది.హిందీ మార్కెట్ ని గ్రాబ్ చేయాలంటే ఒక్క సిరీస్ తో ఏమైపోతుంది.

కావాలంటే డబ్బులకు కొదవేముంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

మంచి సినిమా తీయచ్చు కదా.రే డోనోవన్ అనే ఇంగ్లీష్ సిరీస్ కి ఇది ఆఫీసియల్ రీమేక్ గా తెలుస్తుంది.దీనికి రెండో సీజన్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది.

Advertisement

ఇక ప్రమోషన్ ఇంటర్వ్యూ లు ఇస్తున్న రానా, వెంకీ ఏకంగా మా సిరీస్ ని చూడద్దు అని కూడా చెప్తున్నారు.ఏంటో కానీ మొత్తంగా ఈ సిరీస్ ద్వారా రానాకు పోయేది లేదా వచ్చేది ఏమి లేదు.

కానీ వెంకటేష్ కి మాత్రం జనాల ఛీత్కారం దక్కుతుంది.

తాజా వార్తలు