ఇదిగో క్లారిటీ : ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిన ఎన్నికల కమిషనర్

అకస్మాత్తుగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ప్రబ్యత్వం ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.

అంతే కాదు కేవలం టీడీపీ ప్రభుత్వానికి మేలు చేకూర్చేలా రమేష్ కుమార్ కుల పిచ్చితో ఎన్నికలను వాయిదా వేయించారని, ఆయనను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడం తదితర అంశాలు పెద్ద దుమారం రేపింది.

ఈ విషయంపై సుప్రీం కోర్ట్ కి కూడా వైసీపీ ప్రభుత్వం వెళ్ళింది.రోజు రోజుకి ఈ వివాదం మరింత ముదురుతుండడంతో పాటు తాను కూడా విమర్శలపాలవుతుండడంతో పాటు చీఫ్ సెక్రటరీ నీలం సహానీ దీనిపై ఎన్నికల కమిషనర్ కు లేఖరాయడంతో రమేష్ కుమార్ దీనిపై స్పందించారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఏపీలో ఎన్నికలను వాయిదా వేసాము తప్ప, మరో ఉద్దేశం లేదని, రమేష్ కుమార్ ఏపీ సీఎస్ నీలం సాహ్నికి మూడు పేజీలతో కూడిన లేఖ రాశారు.ఎన్నికలను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో అందులో సవివరంగా క్లారిటీ ఇచ్చారు రమేష్ కుమార్.

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరపలేమని రమేశ్ లేఖలో స్పష్టం చేశారు.దీనికి ముందు ఎన్నికలు జరపాలని ఏపీ సీఎస్ నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు.

Advertisement

కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితా ముద్రణతో పాటు అన్నిరకాల ఏర్పాటు పూర్తి చేసిన తరుణంలో ఎన్నికల వాయిదా తగదంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు.ప్రజారోగ్యం బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినదని, కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది అంటూ ఆమె పేర్కొన్నారు.

సీఎస్ రాసిన లేఖకు స్పందిస్తూనే రమేష్ కుమార్ ఇప్పుడు ఇలా ప్రత్యుత్తరం రాయడం సంచలనం రేపుతోంది.

రమేష్ కుమార్ రాసిన లేఖను ఒకసారి పరిశీలిస్తే, ఎన్నికలను వాయిదా వేసినందుకు ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు వస్తున్నాయి.ఆర్థిక సంఘం నిధులు రాకుండా పోతాయని అంటున్నారు.ఈ నేపథ్యంలో నేను ఎన్నికల వాయిదా విషయాన్ని స్ట్రైయిట్‌గా చెప్పాలనుకుంటున్నా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

నేను కూడా గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశా.స్థానిక ఎన్నికల నిర్వహిస్తేనే నిధులు వస్తాయన్నది ఒక నిబంధన అని తెలుసు.

Advertisement

అయినా.గతంలో చాలా సందర్భాల్లో ఎన్నికలను నిలిపివేసినా నిధులు వచ్చాయి.

ఎన్నికలకు, ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టవద్దు.కరోనా ప్రభావంతోనే ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది.

ఏపీలోనే కాదు.మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోనూ స్థానిక ఎన్నికల వాయిదా వేశారు.

నేను ఏపీ ఆరోగ్య శాఖతో కరోనా ప్రభావాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించా.కానీ, ఆ శాఖ బిజీగా ఉండటం వల్ల సమాచారం అందించలేకపోయిందనుకుంటా.

ఈ క్రమంలోనే మీ నుంచి లేఖ వచ్చింది.కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.

దానికి సంతోషం.కాకపోతే.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారిగా ప్రకటించింది.రెండో దశ కింద ఆ వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది.

ఈ నేపథ్యంలోనే కేంద్రం ఇచ్చిన నివేదికల ప్రకారం.ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నాం.

అదే సమయంలో.ఆర్థిక సంఘం నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు తమ వంతు సహకారం అందిస్తాం.

కావాల్సిన డాక్యుమెంట్లను అందిస్తాం. అని పేర్కొన్నారు.

కరోనా తగ్గగానే.కేంద్రం నుంచి సమాచారం అందుతుందని, ఆ వెంటనే ఎన్నికలను నిర్వహిస్తామని రమేశ్ లేఖలో తెలిపారు.

తాజా వార్తలు