రామ్‌ ఫ్యాన్స్ ను భయపెడుతున్న ఇంగ్లీష్ సెంటిమెంట్

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా రూపొందిన ది వారియర్‌ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది.

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కు తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వం వహించాడు.

భారీ అంచనాల నడుమ మాస్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సినిమా కు సంబంధించిన విడుదల తేదీ దగ్గర పడుతుంది.అదుగో ఇదుగో అంటూ ఈ సినిమా ను కాస్త ఆలస్యం చేసిన యూనిట్‌ సభ్యులు మరో రెండు వారాల్లో విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉన్నప్పుడు ఈ సినిమా కు మంచి బజ్ క్రియేట్ చేయడం కోసం పలు కార్యక్రమాలను నిర్వహించారు.తాజాగా కూడా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంకా పూర్తి స్థాయి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కాలేదు.సినిమా కు పాజిటివ్‌ బజ్ అయితే ఇంకా కనిపించడం లేదు.

Advertisement

ఈ సమయంలోనే రామ్‌ అభిమానులు కొందరు ఒక బ్యాడ్‌ సెంటిమెంట్‌ ను పట్టుకుని భయపడుతున్నారు.గతంలో రామ్‌ నటించిన హైపర్‌.

రెడ్ ఇంకా ఒకటి రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి.అందులో మెజార్టీ సినిమా లు ఇంగ్లీష్ టైటిల్స్ ను కలిగి ఉన్నాయి.

ఇప్పుడు ది వారియర్ మూవీ కూడా ఇంగ్లీష్ టైటిల్‌ ఉంది.కనుక ఈ సినిమా ఫలితం ఏంటో అన్నట్లుగా భయపడుతున్నారు.

ది వారియర్‌ సినిమా ఖచ్చితంగా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ అన్నట్లుగా కొందరు రామ్‌ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.కాని కొందరు మాత్రం బ్యాడ్‌ సెంటిమెంట్‌ తో భయపడుతున్నారు.

Lorem Ipsum Dolor Sit Amet
ఆ క్షేత్రంలో ఇప్పటికీ కాకులు కనిపించకపోవడానికి గల కారణం ఇదే..!

ఇదే సమయంలో ఇస్మార్ట్‌ శంకర్‌ అంటూ వచ్చిన సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది కదా అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.మొత్తానికి ది వారియర్‌ సినిమా తో రామ్‌ ను మరో మాస్ యాంగిల్‌ లో చూస్తామేమో చూడాలి.

Advertisement