రెడ్ కోసం ఎగబడుతున్న ఓటీటీలు

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ హీరో.

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాతో రామ్ దిమ్మతిరిగే సక్సెస్‌ను అందుకున్నాడు.ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే ప్రారంభించిన రామ్, త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేసే పనిలో పడ్డాడు.

Ram Red Movie Gets Stunning Offer, Ram Pothineni, Red, Ismart Shankar, OTT, Toll

రెడ్ అనే టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న రామ్, ఇందులో డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు.కాగా ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.కాగా ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, కరోనా వైరస్ కారణంగా అది వాయిదా పడింది.

Advertisement

ఇక ప్రస్తుతం ఓటీటీలకు అదిరిపోయే ఆదరణ లభిస్తుండటంతో నిర్మాతలు తమ సినిమాలను ఇందులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఈ క్రమంలోనే రామ్ రెడ్‌కు గతంలోనే రూ.20 కోట్ల ఓటీటీ ఆఫర్ వచ్చినా సినిమాను అమ్మలేదు.కాగా తాజాగా రూ.30 కోట్ల భారీ ఆఫర్ రావడంతో రెడ్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారా అనే సందేహం సర్వత్రా నెలకొంది.మరి ఈ సినిమాను నిర్మాత స్రవంతి రవికిషోర్ ఓటీటీలో రిలీజ్ చేస్తాడా లేక థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తాడా అనేది చూడాలి.

అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!
Advertisement

తాజా వార్తలు