రామ్ అస్సలు తగ్గడం లేదుగా.. మరో మైల్ స్టోన్ ను టచ్ చేసిన 'బుల్లెట్ సాంగ్'..

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోల్లో రామ్ పోతినేని ఒకరు.ఇంతకు ముందు అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉండే రామ్ ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ఆయన తన లుక్ ని పూర్తిగా మార్చి చాకొలేట్ బాయ్ కాస్త యాక్షన్ హీరోగా మారిపోయి మాస్ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.

 Ram Pothineni The Warrior Bullet Song Cross 150 Million, Ram Pothineni , The War-TeluguStop.com

ఈ సినిమా ఇచ్చిన జోష్ తో రామ్ మరిన్ని మాస్ అండ్ యాక్షన్ సినిమాలనే ఎంచుకుంటూ మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యి మాస్ హీరో అనిపించు కోవడానికి బాగా ట్రై చేస్తున్నాడు.

ఇందులో భాగంగానే రామ్ రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు.

ప్రెసెంట్ రామ్ కోలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేస్తున్నాడు.ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది.

రామ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ అందరిని ఆకట్టుకున్నాయి.

ఈ క్రమంలోనే ఇందులో నుండి వచ్చిన బుల్లెట్ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.మిగతా పాటల కంటే కూడా ఈ పాట యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకు పోతుంది.

ఈ సాంగ్ తాజాగా మరొక మైల్ స్టోన్ చేరుకుంది.ఏకంగా 150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.1.53 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తూ ఉండగా.కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను జులై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై తెలుగు, తమిళ్ భాషల్లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

మరి రామ్ వీరి అంచనాలను రీచ్ అవుతాడో లేదో చూడాలి.ఇక పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

https://youtu.be/f0T6jFsWMak
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube