ఆ సినిమా నుంచి నాగ్ మమ్మల్ని తీసేశారు.. రామ్ లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున వరుస సినిమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.సినిమాలలో తన శైలికి తగిన ఫైట్లు ఉండటానికి నాగ్ ఇష్టపడతారు.

 Ram Laxman Shocking Comments About Hero Nagarjuna Details Here,ram Laxman, Hero-TeluguStop.com

ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగార్జునకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఒక లిమిట్ ఉండే ఆర్టిస్ట్ లు సైతం ప్రస్తుతం భారీ రేంజ్ లో ఫైట్లు కావాలని అడుగుతున్నారని రామ్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.

కొన్నిసార్లు హీరో డామినేషన్ కోసం, డైరెక్టర్ కోరిక మేరకు ఫైట్లు కంపోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయని రామ్ లక్ష్మణ్ తెలిపారు.అవసరం లేని చోట ఫైట్లను ఎక్కువగా పెడితే నెగిటివ్ కామెంట్లు వస్తాయని రామ్ లక్ష్మణ్ తెలిపారు.

హీరోల బాడీ లాంగ్వేజ్ లకు అనుగుణంగా ఫైట్లు కంపోజ్ చేస్తామని రామ్ లక్ష్మణ్ కామెంట్లు చేశారు.ప్రస్తుతం ఆడియన్స్ కూడా హీరోలకు దెబ్బలు తగలాలని కోరుకోరని రామ్ లక్ష్మణ్ తెలిపారు.

Telugu Gabbar Singh, Nagarjuna, Nenunnanu, Ram Laxman, Tollywoodtop-Movie

కథ, సీన్ డిమాండ్ ను బట్టి ఫైట్లను కంపోజ్ చేయడం జరుగుతుందని రామ్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.రియలిజం ఉన్న కథ దొరికితే అద్భుతంగా ఫైట్లు క్రియేట్ చేయవచ్చని రామ్ లక్ష్మణ్ తెలిపారు.నువ్వు వస్తావని సినిమా సమయంలో ఫైటర్ కాలు విరిగిపోయిందని భద్ర, తలసి షూటింగ్ ల సమయంలో చిన్నచిన్న ప్రమాదాలు జరిగాయని రామ్ లక్ష్మణ్ కామెంట్లు చేశారు. గౌతమీపుత్ర శాతకర్ణి సమయంలో బాంబు పేలితే గుర్రం బెదిరిందని రామ్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.

గబ్బర్ సింగ్ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ కు పని చేశామని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ చెప్పుకొచ్చారు.గబ్బర్ సింగ్ సినిమాతో మంచి పేరు వచ్చిందని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ చెప్పుకొచ్చారు.

నాగార్జున నేనున్నాను సినిమాలో వచ్చిందని నాగార్జునకు మేము కంపోజ్ చేసిన ఫైట్లు నచ్చక తీసేశారని ఆ సమయంలో బాధపడ్డామని రామ్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.రామ్ లక్ష్మణ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube