Ram Gopal Varma : సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాసిన ఆర్జీవీ.. అసలేం జరిగిందంటే?

తాజాగా టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) ఏపీ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు.

ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై( minister Bandaru Satyanarayana ) జగన్ సర్కారు తీసుకున్న చర్యలను ఆర్జీవీ అభినందించారు.

ఇటువంటి నాయకులపై పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎక్స్ లో కోరారు.ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేశారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ram Gopal Varma Writes A Open Letter To Ap Cm Ys Jagan Mohan Reddy

ఈ మేరకు ఆయన బహిరంగ లేఖలో ఈ విధంగా రాసుకొచ్చారు.చంపుతా, బట్టలిప్పి నిలబెడతా, గొంతు కోస్తా లాంటి రెచ్చగొచ్చే మాటలు.నిరాధార ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Advertisement
Ram Gopal Varma Writes A Open Letter To Ap Cm Ys Jagan Mohan Reddy-Ram Gopal Va

ప్రజలు ప్రభావితమయ్యేలా తప్పుడు సమాచారం, హానికరమైన అబద్ధాలను ప్రచారం చేసేవారిని అస్సలు ఉపేక్షించొద్దు అని రాంగోపాల్ వర్మ తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.ఇదే కాకుండా మంత్రి ఆర్కే రోజా గురించి అసభ్యంగా మాట్లాడిన బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంతకుముందు జాతీయ మహిళా కమిషన్ ను కోరారు.

మహిళా మంత్రిపై మీ పార్టీ నాయకుడు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటూ నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలను( Nara Bhuvaneswari , Nara Brahmini ) రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు.

Ram Gopal Varma Writes A Open Letter To Ap Cm Ys Jagan Mohan Reddy

బండారు సత్యనారాయణ మాట్లాడిన యూట్యూబ్ వీడియో లింక్ కూడా షేర్ చేశారు.బండారు సత్యనారాయణకు మద్దతుగా నారా లోకేశ్ చేసిన ట్వీట్ ను అంగీకరిస్తారా అని కూడా ఆర్జీవీ ప్రశ్నించారు.ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు బహిరంగ లేఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాటిని చూసిన నెటిజన్స్ కొందరు రాంగోపాల్ వర్మ కి మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు