వర్మ 'వ్యూహం' కి పవన్ కి సంబంధం ఏంటీ?

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం అనే ఒక పొలిటికల్ డ్రామా సినిమాను రూపొందించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ఏపీ రాజకీయాల నేపథ్యం లో రూపొందుతుందని సమాచారం అందుతుంది.

ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో రాంగోపాల్ వర్మ భేటీ అయ్యాడు.ఆ భేటీ తర్వాతనే ఆయన వ్యూహం అనే సినిమా ను ప్రకటించడం తో కచ్చితంగా ఇది ఏపీ రాజకీయాలకు సంబంధించిన సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన అస్సలు ఉండదని తెలుస్తోంది.రాంగోపాల్ వర్మ సన్నిహితులు మరియు ఆయన సినిమాలకు వర్క్ చేసే వారు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పై గతంలో రామ్ గోపాల్ వర్మ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఆ సినిమా తీవ్ర దుమారం ను రేపింది.

Advertisement
Ram Gopal Varma Vyuham Movie Update Pawan Kalyan Details, Janasena, Pawan Kalyan

రాంగోపాల్ వర్మ పై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే విధంగా ఆ సినిమా ఉంది.కానీ వ్యూహం లో మాత్రం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎలాంటి విమర్శలు ఉండవని.

కేవలం ఈ సినిమా ఏపీలో కొనసాగుతున్న రాజకీయ వ్యూహాలు ఎత్తుకు పై ఎత్తులు మాత్రమే ఉంటాయి అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Ram Gopal Varma Vyuham Movie Update Pawan Kalyan Details, Janasena, Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయకుండా తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని రాంగోపాల్ వర్మ కచ్చితం గా టార్గెట్ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు మరియు వర్మ సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వ్యూహం కి సంబంధించిన మరిన్ని విషయాలు అతి త్వరలోనే వెల్లడిస్తానంటూ రాంగోపాల్ వర్మ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.విడుదలైన తర్వాత ఎంతటి సంచలనాన్ని ఈ సినిమా నమోదు చేస్తుందో చూడాలి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు