ప్రతీ అడ్డమైన సినిమాకీ పబ్లిసిటీ ఇవ్వాలి అంటే అది రాం గోపాల్ వర్మ వల్లనే సాధ్యం.ఎదో ఒక సాకు చూపించి దానికి పై పైన కలరింగ్ యాడ్ చేసి రామూ వివాదాలు సృష్టిస్తూ ఆ వివాదం నేపధ్యంలో తన సినిమా తీసేసి ఫ్రీ పబ్లిసిటీ లో విడుదల చేస్తారు.
బెజవాడ రౌడీలు అని అప్పట్లో టైటిల్ తో సినిమా తీస్తా అని వర్మ సంచలనం సృష్టించగా కోర్టు అడ్డం పడ్డం తో బెజవాడ గా ఉంచారు ఆ పేరు ని.ఆ సినిమా పెద్దగా ఆడలేదు అది వేరే విషయం.దానికి ముందర పరిటాల రవి జీవిత గాథ తో రక్త చరిత్ర సినిమా తీసి సంచలం సృష్టించారు ఆయన.ఓబుల్ రెడ్డిని విలన్ గా చూపించారని అతని కుటుంబ సభ్యులు వర్మకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.అయితే ఇలాంటి బెదిరింపులకు వర్మ అసలు భయపడలేదు.
తాజాగా విజయవాడ నేపథ్యంలో వంగవీటి అనే పేరుతో సినిమా తీయనున్నట్లు ప్రకటించారు.దీనిపై ఇప్పుడు వర్మకు పెద్ద వార్నింగులే వెళుతున్నాయి.చాలా మంది బెదిరింపులకు పాల్పడ్డారు.
అయినా వర్మ భయపడలేదు.ఈ రోజు విజయవాడ వెళ్లి… దేవినేని నెహ్రూ వంగవీటి కుటుంబాలను కలవనున్నాడు.
దాంతో ఇప్పుడు విజయవాడలో ఒకటే టెన్షన్.ఇంతకు ముందే వర్మ… నేను ఈనెల 26న విజయవాడ వస్తున్నా.
పలానా ఫ్లైట్లో వస్తున్నా నేను బస చేసే హోటల్ ఇదే.ఎవరొస్తారో రండి అంటూ ట్విట్టర్ ద్వారా సవాల్ కూడా విసిరాడు.వీటిపై బెజవాడ యూత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.ఏపీ సీఎం కూడా విజయవాడలో వుంటున్నారు.మరి అక్కడ లాండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్టుగా మెయింటైన్ చేస్తోంది పోలీస్ శాఖ.ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకపోవచ్చని అంటున్నారు.వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో.