క్రిష్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్న రామ్ చరణ్

టాలీవుడ్ లో కొంత మంది దర్శకులతో హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలు సినిమాలు చేయాలని అనుకుంటారు.అప్పట్లో ఆ మార్క్ కె విశ్వనాథ్, సింగీతం శ్రీనివాసరావు, జంధ్యాల లాంటి దర్శకులకి ఉండేది.

 Ram Charan Waiting For Krish Movie, Tollywood, South Cinema, Pawan Kalyan, Mega-TeluguStop.com

కళాత్మక సినిమాలు చేయడంలో దిట్ట అనిపించుకున్న అలాంటి దర్శకులు ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్దగా లేకపోయినా ఇంచుమించు దర్శకుడు క్రిష్ ఆ కోవకే చెందుతాడు.అతని గమ్యం నుంచి చేసిన సినిమాలు కమర్షియల్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నవి పెద్దగా ఏమీ లేవు.

అయిన కూడా స్టార్ హీరోలు ఆ దర్శకుడుతో సినిమా చేయాలని అనుకుంటారు.హీరోయిజంతో పాటు నటుడుని సినిమాపై ప్రెజెంట్ చేయడంలో క్రిష్ శైలి భిన్నంగా ఉంటుంది.

అందుకే స్టార్ హీరోలు అతనితో సినిమా కోసం ఎదురుచూస్తారు.

ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో మెప్పించేంత కథ లేకపోయినా తన ప్రెజెంటేషన్ తో కొంత వరకు కాపాడే ప్రయత్నం చేశాడని చెప్పాలి.

అయితే ఈ బయోపిక్ సిరీస్ డిజాస్టర్ కావడంతో కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినా ఈ దర్శకుడు మరల నెక్స్ట్ సినిమాని ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు.పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇప్పటి వరకు చేయని విధంగా ఓ పీరియాడికల్ యాక్షన్ కథలో అతనిని చూపించబోతున్నాడు.

ఇప్పటి వరకు హీరోగా అందరిని కనిపించిన పవన్ కళ్యాణ్ ఇందులో సరికొత్త లుక్ లో ఒక అద్భుతమైన నటుడుని చూసే అవకాశం ఉందని అందరూ అంటున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత క్రిష్ తో సినిమా చేయడం కోసం మెగా హీరో రామ్ చరణ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

వీలైతే ఆర్ఆర్ఆర్ తర్వాత క్రిష్ సినిమాతో మళ్ళీ రావాలని భావిస్తున్నాడు.దీనికోసం ఇప్పటికే ఈ దర్శకుడుతో సంప్రదింపులు జరిపినట్లు టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube