లాంగ్ లీవ్ ప్లాన్ చేసుకుంటున్న చరణ్.. భార్య, బిడ్డ కోసమేనంటూ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పేరు ఉంది.

ఈయన గత సినిమా ఆర్ఆర్ఆర్ (RRR) ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ట్రిపుల్ ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకుని గ్లోబల్ వైడ్ గా మార్కెట్ సొంతం చేసుకున్న చరణ్ నెక్స్ట్ సినిమాపై ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ప్రజెంట్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి.

శంకర్ (Director Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.ఇక ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది పక్కన పెడితే రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు.

Ram Charan To Take Long Break For Upasana Details, Director Shankar, Ram Charan,
Advertisement
Ram Charan To Take Long Break For Upasana Details, Director Shankar, Ram Charan,

పెళ్లి అయ్యిన 10 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీలో సంతోషం నెలకొంది.ఎప్పుడెప్పుడు మెగా వారసుడు వస్తాడా అని మెగా కుటుంబంతో పాటూ మెగా ఫ్యాన్స్ కు ఎదురు చూస్తున్నారు.మరొక నెలలోనే మెగాస్టార్ ఇంట ఒక బిడ్డ రాబోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ బిడ్డరాక ముందు నుండే తన భార్యాబిడ్డతో గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట.

Ram Charan To Take Long Break For Upasana Details, Director Shankar, Ram Charan,

ఇప్పుడు చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మాత్రమే కాకుండా ఉప్పెన డైరెక్టర్ తో కూడా నెక్స్ట్ సినిమా చేయనున్నాడు.ఈ క్రమంలోనే షూటింగులకు అన్నిటికి కాస్త బ్రేక్ ఇవ్వబోతున్నారట.ఇప్పటికే ఉపాసనకు ( Upasana ) నెలలు నిండుతున్నాయి.

వచ్చే నెల బిడ్డ పుట్టే అవకాశం ఉంది.అందుకే చరణ్ ముందుగానే తన భార్య బిడ్డకు ఎక్కువ సమయం కేటాయించాలని లాంగ్ లీవ్ తీసుకుంటాడంటూ ప్రచారం జరుగుతుంది.

దాదాపు 2 నెలల పాటు షూటింగులకు బ్రేక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట.చూడాలి మరి ఇందులో ఎంత నిజముందో.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు