టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటుడిగా రాంచరణ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఫాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ప్రస్తుతం వరుస సినిమాలో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సెలబ్రిటీలు( Celebrities ) అంటే వారి గురించి ఎన్నో రకాల రూమర్స్ రావడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే హీరో రామ్ చరణ్ గురించి కూడా ఇలాంటి వార్తలు ఎన్నో వచ్చాయి.
ముఖ్యంగా హీరోయిన్లతో అఫైర్స్ అంటూ ఈయన గురించి వచ్చిన వార్తలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన నటించిన మొదటి సినిమా చిరుత హీరోయిన్ నేహా శర్మతో ( heroine Neha Sharma )ప్రేమలో పడ్డారని ఈ విషయం తన తండ్రికి తెలిసి చరణ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ కూడా వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే.
ఇలా రామ్ చరణ్ గురించి తరచూ ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ఈ రూమర్స్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ రూమర్ విని తాను కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలిపారు.
అసలు తనతో ప్రేమలో ఉన్నానని లేచిపోయాను హనీమూన్ వెళ్ళామంటూ కూడా వార్తలు వచ్చాయి ఈ వార్తలు విని నేను మాత్రమే కాదు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యారని అయితే ఇలాంటి వాటి గురించి ఏమీ పట్టించుకోకు అంటూ మమ్మీ డాడీ తనకు ధైర్యం చెప్పారని చరణ్ వెల్లడించారు.
ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఉపాసన( Upasana ) తో ప్రేమ ప్రయాణం గురించి కూడా చరణ్ వెల్లడించారు.ఉపాసన తను ఏడు సంవత్సరాలు పాటు ఇద్దరు కూడా మంచి స్నేహితులం అయితే ఈ ఏడు సంవత్సరాల కాలంలో మా ఇద్దరి మధ్య ప్రేమ అనే ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదని అయితే నిశ్చితార్టానికి ఏడాది ముందు తనపై కాస్త ఇంట్రెస్ట్ ఉండడంతో తన ప్రేమ విషయాన్ని ముందు నేనే బయటపెట్టి తనకు ప్రపోజ్ చేశానని చరణ్ వెల్లడించారు.అయితే తను కూడా నాపై ఇష్టం ఉందనే విషయం నాకు అప్పుడే తెలిసిందని, దీంతో తనకు ప్రపోజ్ చేయగా ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది అంటూ చరణ్ తెలిపారు.
ఏడు సంవత్సరాల పాటు మంచి ఫ్రెండ్స్ గా మూవ్ అయినటువంటి మేము ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నామని తద్వారా నా గురించి ఎన్ని రకాల వార్తలు వచ్చిన ఉపాసన నమ్మలేదని చరణ్ తెలిపారు.
ఇక ఉపాసనకు మొదటి నేనే ప్రపోజ్ చేశానని, ఈ విషయం డాడీకి చెప్పడంతో నాన్న కూడా వెళ్లి వాళ్ళ నాన్నతో మాట్లాడటం జరిగిందని అలా పెళ్లి జరిగిపోయిందని చరణ్ తెలిపారు.ఉపాసన గురించి మాట్లాడుతూ… నాన్నతో ఒక రెండు నిమిషాల పాటు మేము మాట్లాడాలి అంటే కాస్త కంగారు పడతాము కానీ ఉపాసనకు అసలు భయం లేదు.డైరెక్ట్ గా వెళ్లి ఏం మామయ్య ఏం చేస్తున్నారంటూ నాన్నతో మాటలు పెట్టుకుంటుందని వీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటే అసలు ఏం మాట్లాడుతున్నారో అని మాకు కంగారు పెరిగిపోతుందని చరణ్ వెల్లడించారు.
నాన్న ఉపాసన చాలా మంచి స్నేహితులనీ, నాన్న సపోర్ట్ ఎప్పుడు ఉపాసనకే ఉంటుంది అంటూ ఈ సందర్భంగా చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.