లిటిల్ బ్రదర్ తో రామ్ చరణ్.. నెట్టింట వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ పిక్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు.

చిన్న చిన్న విషయాలను పంచుకుంటూ తన అభిమానులకు దగ్గరగా ఉంటూ వారిని మరింత సంతోష పెడుతున్నాడు.

ఇక తాజాగా చరణ్ సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేసాడు.ఈ రోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే.

మరి తమ్ముడు పుట్టిన రోజు సందర్భంగా చరణ్ స్పెషల్ విషెష్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఒక పిక్ షేర్ చేసాడు.ఈయన షేర్ చేసిన పిక్ ఇప్పుడు నెట్టింట మంచి వైరల్ గా మారిపోయింది.

రామ్ చరణ్ తన తమ్ముడు వరుణ్ తేజ్ ను ఎత్తుకుని దిగిన చిన్నప్పటి ఫోటో షేర్ చేసాడు.ఈ బ్యూటిఫుల్ ఫోటో చూసి మెగా ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.

Advertisement

దీంతో ఇది ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇక ప్రెజెంట్ వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా ఇది మెగా ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకుంది.ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రెజెంట్ చరణ్ వరల్డ్ వైడ్ గా వచ్చిన స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

అలాగే అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ15 సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లి 70 శాతానికి పైగానే పూర్తి చేసుకుంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత ఈయన భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ప్రెజెంట్ అయితే బుచ్చిబాబు సానాతో సినిమా ఉంటుంది అని అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది.మరి ఇది ఆర్సీ15 పూర్తి కాగానే స్టార్ట్ చేస్తారో.

Advertisement

లేదంటే మధ్యలో మరో డైరెక్టర్ తో కమిట్ అవుతాడో వేచి చూడాలి.

తాజా వార్తలు