Ram Charan Tej : ఫ్యామిలీ విషయంలో నేను భయపడేది దానికే.. ఆ భయం నన్ను వెంటాడుతుంది: రామ్ చరణ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చిరంజీవి( Chiranjeevi ) వారసుడిగా అడుగు పెట్టారు నటుడు రామ్ చరణ్ తేజ్.

( Ram Charan Tej ) చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈయన వారసుడిగా రాంచరణ్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చి తండ్రిని మించిన తనయుడు అనే పేరు సంపాదించుకున్నారు.చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ సాధించగా, రామ్ చరణ్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా తండ్రిని మించిన తనయుడు అనే గుర్తింపును రాంచరణ్ సంపాదించుకున్నారని చెప్పాలి.

ఇక రాంచరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇక కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి చరణ్ తన కెరియర్ పట్ల తనకు ఎలాంటి భయం లేదని తెలియజేశారు.కెరియర్ ఆగిపోతుందేమోనని ఫ్లాప్స్ తనని వెంటాడుతాయేమోనని తొందరగా ముసలి వాళ్ళు అవుతారేమోనన్న భయం తనకు ఏమాత్రం లేదని తెలిపారు.

Advertisement

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు ఇదే ప్రశ్న ఎదురు కావడంతో తనకు ఎలాంటి భయం లేదని తెలిపారు.కానీ ఫ్యామిలీ ( Family ) పరంగా తనని ఒక భయం వెంటాడుతూనే ఉందని చరణ్ తెలిపారు.

మెగా ఫ్యామిలీ అంతా కూడా ప్రస్తుతం ఎంతో కలిసి సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.వీరంతా కూడా ఏదైనా పండుగ వచ్చింది అంటే ఓకే చోట చేరి పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు.ఇలా మెగా కుటుంబ సభ్యులందరూ( Mega Family )కూడా ఎంతో కలిసి మెలసి సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఇలా సంతోషంగా ఉన్నటువంటి కుటుంబం ఎక్కడ విడిపోతుందో నన్న భయం రామ్ చరణ్ ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుందట.నాన్న మా ఫ్యామిలీకి సెంటర్ ఆఫ్ పోల్ గా ఉన్నారు.

ఇలా నాన్న కారణంగా అందరూ కలిసి ఉన్నామని అయితే ఏదైనా కారణం చేత ఫ్యామిలీ విడిపోతుందేమో అన్న భయం తనని వెంటాడుతూనే ఉంది అంటూ ఈయన తన ఫ్యామిలీ పట్ల ఉన్నటువంటి ప్రేమ బాధ్యతల గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

ఇక రామ్ చరణ్ ( Ram Charan Tej )కూడా ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు అనే విషయం మనకు తెలిసిందే తమ కుటుంబంలో ఎలాంటి వేడుక జరిగిన తప్పకుండా సందడి చేస్తుంటారు ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోతే తప్ప ఆ కార్యక్రమానికి రారు కానీ మిగిలిన అన్ని సందర్భాలలో కూడా మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.ఇక రాంచరణ్ త్వరలోనే వరుణ్ తేజ్ వివాహం కావడంతో ఈయన ఇప్పటికే తన భార్య కూతురుతో కలిసి ఇటలీ చేరుకున్న సంగతి మనకు తెలిసిందే.త్వరలోనే వరుణ్ తేజ్ ( Varun Tej )వివాహం ఎంతో ఘనంగా జరగబోతుంది.

Advertisement
https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=5SVze0&v=1112840952703502

తాజా వార్తలు