గ్లోబర్ స్టార్ తో కమిడియన్ చేసిన అల్లరి అంత ఇంత కాదుగా.. వీడియో వైరల్

తెలుగు టెలివిజన్ ప్రపంచంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు( Anchor Pradeep Machiraju ) పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.తన చలాకితనంతో, టైమింగ్‌తో, కామెడీ టచ్‌తో తెలుగు ఆడియెన్స్‌ను అలరించిన ప్రదీప్, ఇప్పుడు నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్, ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి( Akkada Ammayi Ikkada Abbayi ) అనే సినిమా ద్వారా మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి రెడీ అయ్యాడు.ప్రదీప్-దీపికా పిల్లి జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏప్రిల్ 11న విడుదలకు సిద్ధమవుతోంది.

మూవీ యూనిట్ గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.ఈ సందర్భంగా హీరో ప్రదీప్‌కు పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) నుండి వచ్చిన సపోర్ట్.

Ram Charan Hilarious Fun With Satya And Anchor Pradeep Details, Ram Charan, Anch

ప్రదీప్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రామ్ చరణ్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ఫస్ట్ టికెట్‌ను స్వయంగా కొన్నారు.అంతేకాదు, ప్రదీప్‌తో పాటు కమెడియన్ సత్య కూడా రామ్ చరణ్ ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని ప్రత్యేకంగా పంచుకున్నారు.చరణ్‌ని చూసిన సత్య తన కామెడీ టైమింగ్‌తో నవ్వుల పంట పండించాడు.

Advertisement
Ram Charan Hilarious Fun With Satya And Anchor Pradeep Details, Ram Charan, Anch

‘‘చరణ్ నాకు బాగా క్లోజ్.నేనే చెప్తే వస్తాడు’’ అంటూ కామెడీ చేసాడు.

దీనిపై చరణ్ కూడా ఆటపట్టిస్తూ సరదాగా స్పందించాడు.

Ram Charan Hilarious Fun With Satya And Anchor Pradeep Details, Ram Charan, Anch

సత్య, చరణ్ కాళ్లు మొక్కగా.చరణ్ కూడా కౌంటర్‌గా సత్య కాళ్లను మొక్కబోయాడు.ఈ సరదా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘‘రామ్ చరణ్ ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత సరదాగా ఉంటారు’’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఇది ప్రదీప్‌కి వచ్చిన గొప్ప మోరల్ సపోర్ట్ అని చెప్పవచ్చు.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?

ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’( Peddi ) అనే సినిమా చేస్తున్నారు.

Advertisement

జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదలకాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో అభిమానుల్ని ఫిదా చేసింది.ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ డైలాగ్ డెలివరీ చూసి అంతా ఫిదా అవుతున్నారు.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా చరణ్ మరోసారి తన మాస్ అత్తిట్యూడ్‌ను ప్రూవ్ చేయబోతున్నారు.మొత్తంగా చూస్తే, యాంకర్ ప్రదీప్ రెండో సినిమాకి మెగా హీరో రామ్ చరణ్ ఇచ్చిన సపోర్ట్ సినిమాకు మంచి బజ్‌ను తీసుకొచ్చింది.

ప్రదీప్‌కి ఇది మరో మంచి బ్రేక్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

తాజా వార్తలు