టాలీవుడ్ మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మారుమ పేర్లలో రామ్ చరణ్ పేరు కూడా ఒకటి.
కాగా చెర్రీ గత ఏడాది ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు చెర్రీ.
అంతే కాకుండా ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ కీ సెలెక్ట్ అవ్వడంతో ఆస్కార్ అవార్డు( Oscar Award ) ని కూడా అందుకున్న విషయం తెలిసిందే.ఆస్కార్ అవార్డును అందుకున్న తర్వాత చెర్రీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

ఇది ఇలా ఉంటే ఈనెల మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు అన్న సంగతి మనందరికీ తెలిసిందే.దీంతో ఈసారి చెర్రీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని చూస్తున్నారు అభిమానులు.ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా గ్రాండ్ గా ఏర్పాట్లను చేస్తున్నారు.ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు సెలబ్రేషన్స్ ని కూడా మొదలు పెట్టేశారు అభిమానులు.కనీవిని ఎరుగని రీతిలో ఈసారి చెర్రీ బర్త్డే సెలబ్రేషన్స్( Cherry Birthday Celebrations ) జరగబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో కూడా స్పెషల్ పోస్టర్స్ వదులుతూ నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా స్పెషల్ సీడీపీ పోస్టర్ ను విడుదల చేశారు.ఆర్ఆర్ఆర్ లోని సీతారామరాజు( Sitaramaraju ) పాత్రకు సంబంధించిన లుక్ లోనే ఈ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.

కాగా ఆర్ఆర్ఆర్ లోని పాత్ర రామ్ చరణ్ కు ఎంతటి పేరును తెచ్చిపెట్టిందో మనందరికీ తెలిసిందే.తాజాగా చెర్రీ బర్త్ డే సెలబ్రేషన్ లో భాగంగా ఇలా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి ముందుగానే బర్త్ డే విషెస్ తెలిపారు.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక రేపు సాయంత్ర 6 గంటలకు ఇంపీరియల్ కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు.రామ్ చరణ్ పుట్టిన రోజును చాలా గ్రాండ్ సెలబ్రేట్ చేయడం కోసం అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 25, 26న చెర్రీ నటించిన ఆరెంజ్( Orange ) సినిమానీ కూడా రీ రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.
ఇకపోతే చెర్రీ సినిమాల విషయానికి వస్తే.ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సి 15 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను భారీ బడ్జెట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.







