రామ్‌ చరణ్‌ 16వ సినిమా అప్డేట్ వచ్చింది

రామ్ చరణ్ జక్కన్న సినిమా ఆర్ఆర్‌ఆర్‌ కోసం దాదాపుగా మూడు సంవత్సరాల సమయం ను కేటాయించాడు.ఆ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.

ఆర్ ఆర్ ఆర్‌ ఈనెల 25 వ తారీఖున విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఇప్పటికే తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు.ఆ భారీ బడ్జెట్‌ ప్రతిష్టాత్మక సినిమా కు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

రామ్‌ చరణ్ 15వ సినిమా గా శంకర్ దర్శకత్వం లో సినిమా రూపొందుతుంది.ఇదే సమయంలో చరణ్‌ 16వ సినిమా గురించిన చర్చ మొదలైంది.

Advertisement

ఇప్పటికే రామ్‌ చరణ్ 16వ సినిమాకు జెర్సీ చిత్ర దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.యు.వి.క్రియేషన్స్ వారు ఆర్ సి 16 సినిమాను నిర్మించబోతున్నారు.భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడు అనేది క్లారిటీ వచ్చింది.శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చరణ్‌ 15 సినిమాకు సంబంధించిన షూటింగ్ ఒక కొలిక్కి వచ్చింది.

దాదాపుగా సగం వరకు షూటింగ్ పూర్తయిందని సమాచారం అందుతుంది.జూలై లో ఆర్‌ సీ 15 సినిమా పూర్తి అవుతుందని వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్ 16వ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం అందుతుంది.రామ్ చరణ్ శంకర్ ల సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది.

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

ఇక రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి ల కాంబినేషన్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.అంటే ఏడాది గ్యాప్‌ లో రామ్ చరణ్ నుండి మూడు సినిమా లు రాబోతున్నాయి అన్నమాట.

Advertisement