Rakul Preet Singh : తెలుగమ్మాయి అంటూ చీరకట్టు ఫోటో పంచుకున్న రకుల్.. వెంటనే ఆ విషయాన్ని క్యాచ్ చేసిన నెటిజన్స్?

టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయమైన పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh )గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

కొంతకాలం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ వైపు దృష్టి మలిపింది.

తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను అందుకుంది.తెలుగుతో పాటు హిందీ, కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.

తొలిసారిగా కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది రకుల్.తర్వాత కెరటం సినిమా( Keratam movie )తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా( Venkatadri Express )లో నటించి ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమా తర్వాత వరుసగా బాగా అవకాశాలు అందుతుంది.

Advertisement
Rakul Shared A Saree Photo Saying She Was A Telugu Girl Did The Netizens Catch

అలా వెనుకకు తిరిగి చూడకుండా బాగా పరుగులు తీసింది.ఇక మంచి హోదాలో ఉన్న సమయంలోనే టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పేసింది.

Rakul Shared A Saree Photo Saying She Was A Telugu Girl Did The Netizens Catch

ఇక బాలీవుడ్ లో సెటిలై అక్కడే వరుస సినిమాలు చేస్తూ ఉంది.అక్కడికి వెళ్ళాక టాలీవుడ్( Tollywood ) లో పెట్టిన కండిషన్స్ అన్ని మర్చిపోయి అక్కడ బాగా రచ్చ రచ్చ చేస్తుంది.ఖాళీగా ఉంటే చాలు సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తూ బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ బాగా డైటింగ్ చేసి సన్నబడింది.నిజానికి తను అంత బొద్దుగా ఏమీ లేదు కానీ అవకాశాల కోసం కావాలనే సన్నబడింది.

సన్నబడ్డాక ఆమెను చూసిన వాళ్లంతా బాగా ట్రోల్స్ చేశారు.పైగా బాగా ఫోటోషూట్లు కూడా చేయించుకోవడంతో ఆ ఫొటోస్ మీమ్స్ రూపంలో బాగా వైరల్ అయ్యాయి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఇప్పుడు టాలీవుడ్ లో తనకు అవకాశాలు ఇచ్చే దర్శకులు కూడా లేరని చెప్పాలి.బాలీవుడ్( Bollywood ) లోనే ఉంటూ బాగా అతి చేస్తూ టాలీవుడ్ ను తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉండటంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెపై బాగా ఫైర్ అవుతూ ఉంటారు.

Advertisement

గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి కొన్ని కామెంట్లు చేయటంతో తనను బాగా ఏకిపారేశారు జనాలు.అంతేకాకుండా టాలీవుడ్లో అలా ఇలా అంటూ కండిషన్లు పెట్టి బాలీవుడ్ లో మాత్రం ఆ కండిషన్ లను దాటేసి రెచ్చిపోయినప్పుడు కూడా జనాలు ఆమెను మరింత టార్గెట్ చేశారు.అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తను చీర కట్టిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది.

అందులో తను రెడ్ కలర్ చీరలో కనిపించింది.ఇక ఆ ఫోటోలకు తెలుగు అమ్మాయి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.దీంతో ఆ ఫోటోలు చూసి.

కాస్త బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది అంటూ కొందరు కామెంట్లు చేయగా.మరికొంతమంది.

తెలుగు అమ్మాయి అన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉండాలి కానీ బాలీవుడ్ లో ఎందుకు ఉంది అంటూ.కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీ గురించి బ్యాడ్ గా కామెంట్లు చేసిన దానివి మళ్లీ తెలుగు అమ్మాయని ఎందుకు అంటున్నావు అంటూ గతంలో తను టాలీవుడ్ పై చేసిన కామెంట్లను క్యాచ్ చేసి మరి ట్రోల్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు