ఆ హీరోతో డీల్ కుదుర్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్

కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ కు స్పైడర్ సినిమా తరువాత అవకాశాలు తగ్గినా ఆమె మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు.

తెలుగులో రకుల్ చేతిలో ప్రస్తుతం చెక్, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా ఉండగా ఈ రెండు సినిమాలు ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే విడుదలవుతున్నాయి.

తెలుగుతో పాటు తమిళంలో కూడా రకుల్ సినిమాల్లో నటిస్తున్నారు.అయితే కోలీవుడ్ కు చెందిన ఒక హీరోతో రకుల్ డీల్ కుదుర్చుకున్నారని సమాచారం.

కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో ఒక సినిమాలో నటిస్తున్న రకుల్ తనకు శివ కార్తికేయన్ తో ఒక ఒప్పందం కుదిరిందని తెలిపారు.సినిమా షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకే తమ మధ్య ఒప్పందం కుదిరిందని సెట్ లో నేను ఆయనతో తమిళంలో మాట్లాడాలని ఆయన నాతో ఇంగ్లీష్ తో మాట్లాడాలని డీల్ కుదుర్చుకున్నామని రకుల్ తెలిపారు.

Sivakarthikeyan And I Had A Pact On The Set Of Ayalaan Says Rakul Preet Singh,

రకుల్ తమిళం నేర్చుకోవడం కోసమే హీరోతో ఈ డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది.శివ కార్తికేయన్ గురించి రకుల్ మాట్లాడుతూ శివ కార్తికేయన్ మంచి నటుడని. డైలాగ్స్ విషయంలో శివ కార్తికేయన్ తనకు ఎంతో సహాయం చేశాడని చెప్పుకొచ్చారు.

Advertisement
Sivakarthikeyan And I Had A Pact On The Set Of Ayalaan Says Rakul Preet Singh,

సెట్ లో ఎంతో సరదాగా జోక్స్ వేసేవారని ఆయన వెల్లడించారు.తనకు ఇష్టమైన ఆహారం చెన్నైలో ఎక్కడ దొరుకుతుందో శివకార్తికేయన్ చెప్పేవారని రకుల్ అన్నారు.

అయలాన్ మూవీ గతేడాది విడుదల కావాల్సి ఉండగా కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది.ప్రస్తుతం అయలాన్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా ఈ ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లు రాకపోయినా మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా రకుల్ కు ఆఫర్లు వస్తూ ఉండటం గమనార్హం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు