కన్నడ నటుడు రక్షిత్ శెట్టి(Rakshit Shetty) హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా ‘సప్త సాగరదాచే ఎల్లో’ అక్కడ హిట్ అవ్వగా ఆ తర్వాత తెలుగులో సప్త సాగరాలు దాటి(Sapta Sagaralu Dhaati) అనే పేరుతో రిలీజ్ చేశారు.
రెండు పార్టులుగా సైడ్ A, సైడ్ Bగా ఈ సినిమా వచ్చింది.
సైడ్ A తెలుగులో సెప్టెంబర్ 22న రిలీజ్ అవ్వగా తాజాగా నేడు నవంబర్ 17న సైడ్ B( Sapta Sagaralu Dhaati Side B ) సౌత్ ఇండస్ట్రీలో ఒకేసారి అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక నేడు (నవంబర్ 17)వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.
సప్త సాగరాలు దాటి సైడ్ A లో హీరో ఎవరో చేసిన యాక్సిడెంట్ కేసుని మను(రక్షిత్ శెట్టి) డబ్బుల కోసం ఒప్పుకొని బయటకి వచ్చి ఆ డబ్బులతో ఇల్లు కట్టుకుందామని తన భార్య ప్రియ (రుక్మిణి వసంత్)( Rukmini Vasanth ) ఒప్పుకోకపోయినా ఆ యాక్సిడెంట్ కేసును తనపైనే వేసుకొని జైలుకు వెళ్తారు.ఈ కేసు ఇచ్చినవాళ్లు చనిపోవడంతో ఏం చేయాలో దిక్కు తెలియనటువంటి మను దాదాపు పది సంవత్సరాల పాటు జైల్లోనే ఉంటారు.
అయితే అంతలోపు తన భార్య మరొక పెళ్లి చేసుకుంటుంది.ఇది సైడ్ ఏ కదా సైడ్ బి లో జైలు నుంచి బయటకు వచ్చినటువంటి మను ఒక ఉద్యోగం చూసుకొని ఉద్యోగంలో చేరుతారు.
బయటకు వచ్చి జాబ్ లో చేరినప్పటికీ మనుకు తన భార్య ప్రియా తరచూ గుర్తుకు రావడంతో తన బాధ్యత ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అనే వెతికే ప్రయత్నం చేస్తారు.మరో వైపు వైపు ప్రియ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి బిజినెస్ లో బాగా లాస్ రావడంతో ఈమె కుటుంబ పోషణ కోసం చాలా కష్టపడుతూ ఉంటుంది.
ఇలా తన భార్య కష్టపడటం చూసినటువంటి మను ఏం చేస్తాడు? ఎలా సహాయం చేస్తాడు ఈ సహాయం చేసే సమయంలో తనకు ఎదురైనటువంటి ఇబ్బందులను ఎలా ఫేస్ చేశారన్నది ఈ సినిమా కథ.
జైల్లో నుంచి బయటకు వచ్చేసరికి భార్య మరొక పెళ్లి చేసుకున్నప్పటికీ తనపై ప్రేమ అలాగే కొనసాగుతుంది.ఈ క్రమంలోనే తనకు మరొక అమ్మాయి దగ్గర కావటం సమయంలో హీరో రక్షిత్( Hero Rakshit ) తన ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎంతో అద్భుతంగా చూపించారు.ఇలా తన పాత్రకు రక్షిత్ పూర్తిగా న్యాయం చేశారని చెప్పాలి.
రుక్మిణి వసంత్ సాధారణ గృహిణిలా మెప్పించింది.ఇక వేశ్య పాత్రలో చైత్ర ఆచార్( Chaitra Achar ) అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
వేశ్యకి కూడా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయని చూపించారు.
మ్యూజిక్, BGM లవ్ ఫీల్ తో మెలోడీగా వినడానికి బాగుంటుంది.కెమెరా విజువల్స్ కూడా బాగున్నాయి.
ఇక నటీనటులను తెరపై డైరెక్టర్ ఏంటో అద్భుతంగా చూపించారు.
సైడ్ B కూడా సైడ్ A లాగే స్లో మెలోడీ డ్రామాగా సాగుతుంది.భార్యపై ప్రేమ చచ్చిపోక తన కష్టాలు పడకూడదని భర్త కష్టపడటం అనే అంశాన్ని మొదటి నుంచి చివరి వరకు అదే పాయింట్ కథ నడిపించారు.అక్కడక్కడా హీరో పక్కన ఉండే ప్రభు క్యారెక్టర్ తో కామెడీ పండించారు.
సాంగ్స్( Songs ) కూడా పార్ట్ 1 లాగే మెలోడీగా సాగుతాయి.
నటీనటుల నటన, కొన్ని ఎమోషన్స్ సీన్స్, మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది.
పాయింట్ మీద కథ మొత్తం కొనసాగడం కాస్త బోర్ అనిపిస్తుంది.
ఎమోషనల్ గా ఒకవైపు ఆకట్టుకున్నప్పటికీ మరోవైపు మాత్రం వీళ్ళు కష్టాలు తీరవా అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.బోర్ కొట్టకుండా ఒకసారి ఈ సినిమాని ఆసక్తిగా చూడవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy