టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రాక్షసుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు రమేష్ వర్మ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఆసక్తిని చూపించారు.
దీంతో ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే హిట్‌గా నిలిచింది.ఇక ఈ సినిమాతో బెల్లంకొండ బాబు తొలి కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నాడు.
ఈ సినిమా సాధించిన సక్సెస్‌తో ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ గురించి ఇండస్ట్రీలో పెద్దగా చర్చ సాగుతోంది.ఇప్పటికే ఈ సినిమాను దర్శకుడు రమేష్ వర్మ త్వరలో ప్రారంభిస్తారనే వార్తలు వినిపించాయి.
అయితే దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు.కాగా తాజాగా రాక్షసుడు చిత్రం సీక్వెల్‌ను చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
ఈ సినిమాకు ‘రాక్షసుడు 2’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది.ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో అప్పుడే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా ఆ స్టార్ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు.ఇక ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
దీంతో రాక్షసుడు 2 చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారా, ఈ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారా, ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే అంశాలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.మరి ఈ సినిమాలో హీరో ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.







