తిరుమల శ్రీవారిని రాజ్యసభ సభ్యుడు సృజన చౌదరి దర్శించుకున్నారు.ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.
టిటిడి అధికారులు ఆయనకు దర్శనం ఏర్పాట్లు చేయగా దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన సృజనా చౌదరి కోవిడ్ విపత్తు సమయంలో సైతం టిటిడి పరిపాలన, నిర్వహణ నిజంగా అభినందించదగింది అన్నారు.
శ్రీవాణీ ట్రస్ట్ టికెట్లు ప్రవేశ పెట్టి దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడం శుభపరినామం అన్నారు.ఈ సందర్భంగా టిటిడికి అభినందనలు తెలిపారు సృజనా.







