ఏపీలో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గ ఏదైనా ఉందా అంటే అది రాజోలు నియోజకవర్గం.2019లో జరిగిన ఎన్నికల్లో రాజోలు మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన ఓటమి చెందింది.స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గంలోనూ విజయం సాధించలేకపోయింది.రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ రాపాకకు ఉన్న బలం కంటే జనసైనికుల బలం ఎక్కువగా ఉండడం, పార్టీ అభ్యర్థి విజయానికి జనసైనికులు గట్టిగా కృషి చేయడం వంటివి రాపాకకు కలిసి వచ్చాయి.అయితే ఆయన ఎంతో కాలం పార్టీలో సఖ్యతగా ఉండలేకపోయారు.
జనసేనలోనే ఉంటూ వైసీపీ అనుబంధ సభ్యుడిగా ఆయన ఇప్పటికీ కొనసాగుతున్నారు.ఇక రాబోయే ఎన్నికల్లో రాపాక ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ? అసలు వైసీపీ ఆయనకు టికెట్ ఇస్తుందా లేదా అనే విషయంలో ఇప్పటికీ ఒక స్పష్టత లేదు. ఇది ఇలా ఉంటే గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన బొంతు రాజేశ్వరరావు ఇప్పుడు జనసేనలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.గత రెండు ఎన్నికల్లోను వరుసగా ఓటమి చెందుతూ వస్తుండడంతో రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే తప్పకుండా జనసేనలో చేరడం ఒక్కటే మార్గం అని బొంతు రాజేశ్వరరావు డిసైడ్ అవ్వడంతో, ఇప్పుడు ఆయనే జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.బొంతు రాజేశ్వరరావు చీఫ్ ఇంజనీర్ గా పనిచేసే రాజకీయాల్లోకి వచ్చారు.2014, 19 ఎన్నికల్లోను ఓటమి చెందారు. ఇక వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ గా ఉండేవారు .ఆ తర్వాత గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం , ఆయనపై ఫిర్యాదులు రావడం తదితర కారణాలతో కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పించడంతో అప్పటి నుంచి అవమానంగా భావిస్తూ వస్తున్న బొంతు వైసిపికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల బొంతు రాజేశ్వరరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు .దీంతో ఆయన జనసేన లో చేరిపోతున్నారనే ప్రచారం మరింత ఊపు అందుకుంది.అయితే స్వయంగా పవన్ కళ్యాణ్ ను రాజోలు నియోజకవర్గం లోని మలికిపురానికి ఆహ్వానించి ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవాలని బొంతు ప్రయత్నాలు చేస్తున్నారట.ఇంతవరకు బాగానే ఉన్నా… బొంతు విషయంలో జనసేన సైనికులకు అనుమానాలు ఉన్నాయట.
బొంతు జనసేన లో చేరితే పార్టీ బలోపేతం కావడం తో పాటు, తప్పకుండా గెలుస్తారనే నమ్మకం ఉన్నా, ఆయనపై అనేక అనుమానాలు కలుగుతున్నాయట.

జగన్కు అత్యంత సన్నిహితులుగా పేరుపొందిన బొంతు రాజేశ్వరరావు ఇప్పటికే రెండుసార్లు ఆ పార్టీ నుంచి పోటీ చేసి వాటిని చెందారని ఇప్పుడు జనసేనలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిచిన తర్వాత రాపాక వరప్రసాదరావు మాదిరిగా వైసీపీకి అనుబంధంగా కొనసాగితే అప్పుడు తమ పరిస్థితి ఏమిటనే సందీప్దంలో ఉన్నారట.







