పాస్ అయితేనే రజినీతో సినిమా చేసే అవకాశం డైరెక్టర్లకు.. ఇదొక ఎగ్జామ్..?

సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) సినిమాలు గతంలో లాగా ఇప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అవడం లేదు.

వయసు పైబడినా సరే రజిని హీరోగానే సాగుతున్నాడు.

అప్పుడప్పుడు హిట్స్ కూడా సాధిస్తున్నాడు.రిటైర్ అయిపోతాడేమో అనుకున్నా ఈ హీరో మాత్రం ఏడాదికి ఒకట్రెండు సినిమాలు తీస్తూ ముందుకు సాగుతున్నాడు.

అయితే ఈరోజుల్లో ఒక దర్శకుడితో సినిమా తీయాలంటే చాలా ఆలోచిస్తున్నాడు రజినీకాంత్.ఈ సూపర్ స్టార్ తో సినిమా చేయాలంటే దర్శకులు ముందుగా ఒక ఎగ్జామ్‌ పాస్ అవ్వాల్సి వస్తోంది.

అదేంటంటే ఒక డైరెక్టర్ రజినీతో సినిమా చేసే అవకాశం దక్కించుకోవాలంటే తమిళంలో ఎవరైనా స్టార్ హీరోలతో కలిసి హిట్ కొట్టాలి.అలాంటి హిట్ సాధించిన దర్శకులతోనే సినిమాలు తీయాలని రజనీకాంత్ భావిస్తున్నారు.

Advertisement
Rajinikanth Tests To Directors ,The Greatest Of All Time, Kollywood, Rajinika

రీసెంట్ సినిమాలు పరిశీలిస్తే ఆయన ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారనేది స్పష్టం అవుతుంది.

Rajinikanth Tests To Directors ,the Greatest Of All Time, Kollywood, Rajinika

ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, రజనీకాంత్ విజయ్( Vijay ) తో సినిమాలు తీసిన దర్శకులతోనే ఎక్కువగా సినిమాలు తీస్తున్నాడు.కోలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం రజినీ ఇప్పుడు వెంకట్ ప్రభుతో కలిసి ఒక మూవీ చేయడానికి ఒప్పుకున్నాడు.వెంకట్ ప్రభు ఇటీవల విజయ్ తో కలిసి "గోట్" సినిమా తీశాడు.

ఇతర భాషల్లో ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ తమిళంలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.వరల్డ్ వైడ్‌గా రూ.450 కోట్లు వసూలు చేసింది.వెంకట్ ప్రభు(Venkat Prabhu ) రజనీకాంత్ ని కలిసి స్టోరీ వినిపించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

నచ్చితే రజనీకాంత్ ఇతను సినిమా చేయడానికి ఓకే చెప్పేయొచ్చు.

Rajinikanth Tests To Directors ,the Greatest Of All Time, Kollywood, Rajinika
వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

ఇక దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ విజయ్‌ హీరోగా "బీస్ట్" మూవీ చేశారు.ఇది ఫ్లాప్ అయింది.అయినా రజనీకాంత్ నెల్సన్ మీద పూర్తి నమ్మకం పెట్టి "జైలర్" సినిమా తీశాడు.

Advertisement

అది మంచి హిట్ సాధించింది.అలా రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు నెల్సన్.

లోకేష్ కనగరాజ్ విజయ్ హీరోగా "లియో" సినిమా తీసి హిట్ కొట్టిన తర్వాత రజనీకాంత్ ఆయనపై కన్నేశాడు.లోకేష్ దర్శకత్వంలో ప్రస్తుతం "కూలీ" )మూ( Coolieవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అంతేకాకుండా ఈ సూపర్ స్టార్ A.R.మురుగదాస్ విజయ్ తో "సర్కార్" సినిమా తీసిన తర్వాతనే అతనికి దర్బార్ సినిమా తీసే అవకాశం ఇచ్చాడు.ఈ విధంగా విజయ్ దర్శకులతో చిత్రాలు తీసేందుకు రజినీ ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు.

సదరు దర్శకుడు హిట్ అందుకున్నాడా లేదా అనేది కూడా ఈ హీరో పరిగణలోకి తీసుకుంటున్నాడు.

తాజా వార్తలు