రంజినికాంత్.( Rajinikanth ) తొలినాళ్లలో జీవితం పై ఎలాంటి అవగాహన లేకపోవడం తో, ఒకేసారి వచ్చిన స్టార్ డం వల్ల, అనేక చెడు అలవాట్లకు గురై తనని తాను ప్రస్తుతం అన్ని విషయాల్లో మలుచుకొని, చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాను అంటూ అందరి ముందు ఒప్పుకునేంత మంచి తనం ఉన్న వ్యక్తి.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయినా ఏ విషయాన్ని అయినా అయన కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడి తప్పును తప్పు అంటూ వేలెత్తి చూపిస్తున్నారు.అయితే ఇప్పుడు రజినీకాంత్ గురించి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే అయన స్టార్ కపుల్ అయినా మంజుల మరియు విజయ్ కుమార్ ల( Manjula Vijay Kumar ) విషయంలో రజినీకాంత్ స్పందించిన విధానం గురించి ఒక అరుదైన సంఘటన మీ కోసం.

మంజుల మొదటి సంతానం అయినా వనిత ( Vanitha Vijay Kumar ) వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందుల్లో పడింది.సొంత తల్లిదండ్రులతో కూడా విభేదించి ఇద్దరు కూతుళ్లతో ఒంటరిగానే ఉంటుంది.ఇక మొదటి భర్త తో కొడుకుని కానీ ఆ కొడుకు కోసం కోర్ట్ కి వెళ్ళింది.వనిత మానసిక పరిస్థితి బాగోలేదని, ఆమె కొడుకు కస్టడీ తనకు కావాలని విజయ్ కుమార్ తన కూతురి పై కేసు పెట్టాడు.
దాంతో ఆమె గట్టిగా ఫైర్ అయ్యింది.అయితే వనిత ను ఎలాగైనా సర్ది చెప్పాలని విజయ్ కుమార్ ప్రయత్నించాడు.ఆమెకు రజినీకాంత్ అంటే చాల ఇష్టం అని ఒక రోజు అయన దగ్గరకు వెళ్లి జరిగిన గొడవ మొత్తం చెప్పి వనితను ఎలాగైనా ఒప్పించాలని అడిగాడు.

కానీ అంత విన్న రజిని కాంత్ నీ కూతురికి ఏమని చెప్పాలి విజయ్. నీ సొంత కొడుకుని వదిలెయ్యి అని చెప్పాలా ? ఆలా ఏ తల్లి అయినా కొడుకుని వదిలేసి ఉండగలదా ? నేను నీ కూతురు విషయం లో ఎలాంటి జోక్యం చేసుకోను అంటూ మొహం మీదనే చెప్పి పంపించేశాడు.ఆ తర్వాత కొన్ని గొడవల తర్వాత విజయ్ కుమార్ తన మనవడి కస్టడీ సంపాదించుకున్నాడు.
అలాగే వనిత కు దక్కాల్సిన ఆస్తిని కూడా ఆమెకు ఇవ్వలేదు.వనిత కి రావాల్సిన ఆస్తిని మొత్తం తన మనవడికి ఇచ్చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాడు విజయ్ కుమార్.