అమలాపాల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రజనీకాంత్... అసలేం జరిగిందంటే?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రజనీకాంత్ ( Rajinikanth ) ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈ వయసులో కూడా ఈయన ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పిస్తూ ఉన్నారు.

 Rajinikanth Gave Strong Warning To That Heroin Journalist Comments Viral , Raj-TeluguStop.com

తాజాగా రజనీకాంత్ జైలర్ ( Jailer ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇకపోతే రజనీకాంత్ కు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈయన ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హీరోయిన్ కు స్వయంగా ఇంటికి వెళ్లి మరి వార్నింగ్ ఇచ్చారంటూ ఓ వార్త కోలీవుడ్ మీడియాలో కోడై కూస్తుంది.

Telugu Aishwarya, Amalapaul, Dhanush, Kollywood, Rajinikanth, Shiva Rajkumar, To

కోలీవుడ్ ప్రముఖ జర్నలిస్టు, సినీ విమర్శకుడు సయ్యరు బాలు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సూపర్ స్టార్ రజినీకాంత్ నటి అమలాపాల్ ఇంటికి వెళ్లి మరి ఆమెకు తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చి వచ్చారని తెలుస్తుంది.అయితే రజనీకాంత్ ఏంటి అమలాపాల్ ( Amalapaul ) ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇవ్వడం ఏంటి అనే విషయానికి వస్తే ఇదంతా రజినీకాంత్ తన కూతురి కోసమే చేశారని ఈయన వెల్లడించారు.

అమలాపాల్ ప్రముఖ హీరో ధనుష్ తో చాలా సన్నిహితంగా ఉండడంతో తన కూతురు అల్లుడు మధ్య విభేదాలు వచ్చాయి అంటూ గతంలో వార్తలు వచ్చాయి.

Telugu Aishwarya, Amalapaul, Dhanush, Kollywood, Rajinikanth, Shiva Rajkumar, To

ఇలా తన కూతురి కాపురంలో విభేదాలు రావడానికి కారణం అమలాపాల్ ( Amalapaul )అని తెలుసుకున్నటువంటి రజనీకాంత్ నేరుగా ఆమె ఇంటికి వెళ్లి తనకు వార్నింగ్ ఇచ్చారట.ఇలా రజనీకాంత్ ఆ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.ప్రస్తుతమైతే ధనుష్ ఐశ్వర్య ( Dhanush Aishwarya )ఇద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా అప్పట్లో రజినీకాంత్ ఆమెకు వార్నింగ్ ఇచ్చారంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ వార్త వైరల్ గా మారింది.అయితే కొందరు రజినీకాంత్ అలా ఇంటికి వెళ్లి ఎందుకు వార్నింగ్ ఇస్తారు అంటూ కామెంట్ చేయగా నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటూ మరికొందరు కూడా ఈ విషయంపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube