పొలిటికల్ జంక్షన్ లో రాజాసింగ్?

భారతీయ జనతా పార్టీలో( BJP ) తెలంగాణ వరకూ ఫైర్ బ్రాండ్ నాయకుల్లో ఒకరుగా చెప్పగలిగిన రాజసింగ్( Raja Singh ) గత కొన్ని రోజులుగా భాజాపాకు దూరమయ్యారు.

ఆయన కొన్ని మైనారిటీ వర్గాలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు కారణం గా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజాసింగ్ ము బహిష్కరించిన భాజపా దాన్ని ఎత్తి వేస్తుందని వార్తలు వచ్చినప్పటికీ వాస్తవంలో అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.

అయితే ఆర్ఎస్ఎస్ సమయం నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న తనపై కేంద్ర వ్యవహరిస్తున్న విధానాలు నచ్చని రాజాసింగ్ పార్టీ మారతారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి .అయితే తన మనస్తత్వానికి ఆలోచన విధానానికి భాజపా మాత్రమే సరిపోతుందని, జాతీయ స్థాయి భావాలున్న తనకు ప్రాంతీయ పార్టీలతో సఖ్యత కుదరదని తేల్చేసిన రాజాసింగ్ పార్టీ మార్పు ఊహగానాలను తోసిపిచ్చారు.అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు మరొకసారి అలాంటి సమీకరణాలకు అవకాశమిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఇటీవల బారాస కీలక నేత మరియు ఆర్థిక శాఖ మంత్రి అయిన హరీష్ రావు ని( Minister Harishrao ) ఆయన ఇంటికి వెళ్లి మరి రాజసింగ్ కలవడం కొత్త ఊహ గణాలకు తావిచ్చింది.

కేంద్ర భాజపా పెద్దల తీరుతో విసిగిపోయిన రాజాసింగ్ పార్టీ మారటానికి సిద్ధమయ్యారని జాతీయ పార్టీగా ఎదుగుతున్న బారాసాలో ( BRS ) అవకాశాలు బాగుంటాయని హరీష్ రావు నచ్చ చెప్పడం తో ఆయన తొందరలోనే బారాస తీర్దం పుచ్చుకొనే అవకాశాలు ఉన్నాయని జోరుగా వార్తలు వస్తున్నాయి.మరి ఎప్పటిలాగానే వాటిని రాజాసింగ్ కొట్టి పారేస్తున్నప్పటికీ రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి మరే అవకాశం కనిపించడం లేని దరిమిలా రాజాసింగ్ బారాసలోకి చేరే అవకాశాలను కొట్టిపారేయలేం అని కొంతమంది నమ్ముతున్నారు.

Advertisement

మాజీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాజాసింగ్ పై నిషేధం ఎత్తివేయడానికి గట్టిగా ప్రయత్నించారు.అయితే అనేక సమీకరణాల నడుమ ఆయన మాజీ కావడంతో ఆ ప్రయత్నాలు అక్కడే ఆగిపోయినట్లుగా తెలుస్తుంది .మరి రాజసింగ్ రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీతో కొనసాగుతుందో మరి కొద్ది రోజుల్లో ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది .

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు