ఆదిపురుష్ డైరెక్టర్ పై రాజమౌళి ఆగ్రహం.. మొత్తం చెడగొట్టారంటూ?

ఇటీవలే డైరెక్టర్ ఓం రౌత్ - ప్రభాస్ ( Om Rauth - Prabhas )కాంబినేషన్ లో వచ్చిన ఆదిపురుష్ సినిమా ఎంతలా విమర్శల పాలవుతుందో చూస్తూనే ఉన్నాం.సినిమా విడుదలైన మొదటి రోజే సినిమాపై బాగా ట్రోల్స్ వచ్చాయి.

ఏకంగా రూ.600 కోట్లు ( 600 crores )పెట్టి తీసిన ఈ సినిమాకు నిరాశ ఎదురైందని చెప్పాలి.ముఖ్యంగా ఈమధ్య వరుస ప్లాఫ్ లతో నిరాశ చెందుతున్న ప్రభాస్ కు ఈ సినిమా మరింత బాధ పెట్టిందని చెప్పవచ్చు.

మొదటిసారి ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడే చాలామంది కార్టూన్ లాగా ఉందని బాగా ట్రోల్స్ చేశారు.దీంతో మరోసారి సినీ బృందం మార్పులు చేసి మరోసారి విడుదల చేయటంతో కొంతవరకు బాగానే అనిపించింది.

కానీ సినిమా చూసిన తర్వాత అందరూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు.ముఖ్యంగా ప్రభాస్ లుక్ జీసస్ లాగా ఉందని, అందులో ఒక వానరుడు అల్లు అర్జున్( Allu Arjun ) లాగా ఉన్నాడు అని నెట్టింట్లో బాగా చర్చ జరిగింది.

ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం డైరెక్టర్ ఓం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.అసలు అందులో రామాయణం ఎక్కడ ఉంది అని.అన్ని కోట్లు ఖర్చు పెట్టించి ఇదేనా నువ్వు చేసింది అంటూ మండిపడుతున్నారు.ఇక సోషల్ మీడియాలో కూడా ఈయనపై బాగా మీమ్స్ కూడా వస్తున్నాయి.

Advertisement

ప్రేక్షకులే కాదు కొంతమంది ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఈ సినిమా పట్ల నిరాశగా ఉన్నారని అర్థమవుతుంది.రాజమౌళికి( Rajamouli ) కూడా ఈ సినిమా నచ్చలేదు అని తాజాగా తెలిసింది.

రాజమౌళి ప్రభాస్ తో బాహుబలి సినిమా చేసి ప్రభాస్ కు కొత్త లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాతే ప్రభాస్ మొత్తం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

ఇక ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేశాడు కానీ అవి ప్లాఫ్ అయ్యాయి.ఇప్పుడొచ్చిన ఆదిపురుష్ కూడా అలాగే మారింది.

అయితే ప్రభాస్ కు, రాజమౌళికి మధ్య మంచి బాండింగ్ ఉంది.అయితే ప్రభాస్ కోసం రాజమౌళి ఈ సినిమా చూడగా సినిమా పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.ఆ సినిమా చూసి ఆయన చాలా డిజ‌ప్పాయింట్ అయిన‌ట్టు అత‌డి స‌న్నిహితుల ద్వారా నిజం తెలిసింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

డైరెక్టర్ ఓం పాత్ర‌ల ప్రాధాన్యత స‌రిగా ఉండేలా చూసుకోలేద‌ని.ఇదేం రామాయ‌ణం.

Advertisement

ఇంత దారుణంగా తీస్తార‌ని తాను అస్స‌లు ఊహించ‌లేద‌ని రాజ‌మౌళి త‌న తీవ్ర అసంతృప్తి, అస‌హ‌నం వ్య‌క్తం చేశాడని.ఓం రౌత్ ఈ సినిమాను పూర్తిగా చెడ‌గొట్టేశార‌ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

అయితే రాజమౌళి కూడా ఎప్పటినుంచో రామాయణం తీయాలని అనుకున్నాడట.కానీ తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల అది చేయటం కుదర లేకపోయిందని.

ఎందుకంటే రామాయణం చేయడం అది సులువైనది కాదని దానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందని తెలిసింది.అయితే ఆది పురుష్ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు.

ఈ సినిమా రాజమౌళి తీస్తే కచ్చితంగా రికార్డు సృష్టించేది అని.కానీ ఓం చేతిలో పడి సర్వనాశనం అయిందని అంటున్నారు.

తాజా వార్తలు