Rajamouli Allu Arjun : టాలీవుడ్ కు జాతీయ అవార్డ్స్ రావడానికి కారణం రాజమౌళి.. ఆయన కష్టమే ఇదంతా అంటూ?

70 ఏళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఒక్క తెలుగు నటుడు కూడా జాతీయ అవార్డు పొందలేదు అన్న విషయం చాలామందికి తెలియదు.అదేంటి ఎన్టీఆర్ చిరంజీవి బాలకృష్ణ లాంటి హీరోలకు కూడా దక్కలేదా అంటే అవును.

 Rajamouli Reason Behind National Awards For Telugu Cinema-TeluguStop.com

ఈ అరుదైన ఘనతను దక్కించుకున్న మొదటి హీరోగా అల్లు అర్జున్( Allu Arjun ) నిలిచారు.అయితే 70 ఏళ్ల భారతీయ చరిత్రలో ఒక్క అవార్డు కూడా రాలేదంటే ఇక్కడ ప్రతిభావంతులైన నటులు లేరా? జాతీయ అవార్డులు ఇచ్చే అంత నటన ఎవరు కనబడచలేదా అన్న అనుమానాలు రాకమానదు.అయితే ఇక్కడ సమస్య ప్రతిపది కాదు.

Telugu Allu Arjum, Bahubali, Keeravani, Nationalawards, Pushpa, Rajamouli, Ram C

లెక్కల పనితనం.అసలు ఇక్కడో(టాలీవుడ్) పరిశ్రమ వుంది, సినిమాలు తీసుస్తున్నారనే స్పృహ‌ కూడా లేకుండా చాలాకాలం వ్యవహరించారు నేషనల్ అవార్డ్ జ్యూరీలో కూర్చున్న కొందరు పెద్దలు.కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారాయి.

69వ జాతీయ అవార్డ్స్ జాబితా గమనిస్తే ఎక్కువగా తెలుగు సినిమా డామినేషన్ కనిపించింది.టాలీవుడ్ అల్లు అర్జున్ జాతీయ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్రను సృష్టించారు.

అయితే ఈసారి నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా డామినేషన్ స్పష్టంగా కనిపించింది.దీనికి కారణం రాజమౌళి అనే చెప్పాలి.

ఎందుకంటే ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఏకంగా ఆరు నేషనల్ అవార్డ్స్ వచ్చిన విషయం తెలిసిందే.అలాగే సుకుమార్( Sukumar ) దర్శకత్వం వహించిన పుష్ప సినిమాకి రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.

అలాగే ఉప్పెన సినిమాకి అవార్డ్ దక్కింది.అలాగే కొండపొలంలో పాటకు చంద్రబోస్ జాతీయ పురస్కారం అందుకున్నారు.

నేష‌న‌ల్ అవార్డు తెలుగు సినిమాకి నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ అంద‌ని ద్రాక్ష‌.

Telugu Allu Arjum, Bahubali, Keeravani, Nationalawards, Pushpa, Rajamouli, Ram C

ఒక్క అవార్డు వ‌చ్చినా అదో మ‌హా ప్ర‌సాదం.అలాంటిది తాజాగా జరిగిన అవార్డ్స్ లో మొత్తం తెలుగు సినిమా డామినేషన్ కనిపించడం అన్నది ఆనందించాల్సిన విషయం అని చెప్పవచ్చు.ఈ ఆనందానికి కారణం రాజమౌళి విజన్.

ఆర్ఆర్ఆర్ సినిమాని ప్రభుత్వం ఆస్కార్ కి నామినేట్ చేయలేదు.కానీ రాజమౌళి ఒక సవాల్ గా తీసుకున్నాడు.

ఆస్కార్ రావాలంటే ఏం చేయాలో అన్నీ పగడ్బందీగా చేశాడు.రాజమౌళి( Rajamouli ) ఎందుకు అంత తాపత్రపడుతున్నారో చాలా మందికి అర్ధం కాలేదు.

ఒక పాటకి ఆస్కార్ రాగానే ఏం జరిగిపోతుందని కామెంట్లు చేశారు.కానీ రాజమౌళి పెట్టిన శ్రమకి ఫలితం ఈ రోజు వచ్చింది.

ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆరు జాతీయ అవార్డులు రావడానికి ఆస్కార్ అవార్డ్ ఒక కొలబద్దగా నిలిచింది. నేషనల్ అవార్డ్ జ్యూరీ సభ్యులని ఆర్ఆర్ఆర్ ని అన్ని కేటగిరీలు ఆకర్షించాయంటే దానికి కారణం ఆర్ఆర్ఆర్ కి రాజమౌళి తెచ్చిన ఆస్కార్ ప్రభ.

అంతేకాకుండా దీని వెనుక రాజమౌళి కష్టం కూడా ఉందని చెప్పవచ్చు.ఆయన కష్టపడడం వల్లే నేడు ఒక్క సినిమాకు ఇన్ని నేషనల్ అవార్డులు లభించాయి.

ఆయన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా గేట్లు తెరవకపోయుంటే ఈ రోజు పుష్పకి ఈ గౌరవం దక్కేదా అనేది ప్రశ్నార్ధకం.ఇప్పుడు తెలుగు సినిమా డామినేష్ లో రాజమౌళి ది కీలక పాత్ర అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube