ఆ హీరోతో రాజమౌళి సినిమా మధ్యలోనే ఆగిపోయింది ఈ విషయం మీకు తెలుసా?

ఒకప్పుడు హీరో లను చూసి మాత్రమే కాదు దర్శకులను చూసి కూడా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే వారు.

కానీ ఇటీవల కాలంలో చాలా తక్కువ మంది దర్శకులు ఇలాంటి క్రేజ్ సంపాదించుకున్నారు అని చెప్పాలి.

ఇక అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, దర్శకరత్న దాసరి నారాయణరావు, కళాతపస్వి కె.విశ్వనాథ్, బాపు లాంటి దర్శకులు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇటీవలకాలంలో త్రివిక్రమ్ సుకుమార్ రాజమౌళి లాంటి పేర్లు కనిపిస్తే చాలు వెనకా ముందు ఆలోచించకుండా థియేటర్లకు వెళ్ళిపోతున్నారు ప్రేక్షకులు.

ముఖ్యంగా నేటి రోజుల్లో రాజమౌళి పేరు కేవలం పేరు మాత్రమే కాదు అదొక పెద్ద బ్రాండ్ గా మారిపోయింది.

Rajamouli Movie Halted With That Hero , Rajamouli Movie , Hero , Rajamouli , D

అయితే ఇక ఇప్పుడు రాజమౌళి ని మించిన దర్శకుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో లేడు అన్నది ఎవరో చెప్పడం కాదు ప్రేక్షకులు అంటున్న మాట.ఇక అలాంటి రాజమౌళి కెరీర్ స్టార్టింగ్ లో ఓ సినిమా మధ్యలోనే ఆగిపోయింది అన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు.ఎన్టీఆర్తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా రాజమౌళి మొదటి సినిమా.

Advertisement
Rajamouli Movie Halted With That Hero , Rajamouli Movie , Hero , Rajamouli , D

ఇక రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణ మొత్తం గురువురాఘవేంద్ర రావే కావడం గమనార్హం.అయితే గురువు రాఘవేంద్రరావు తనయుడు సూర్య ప్రకాష్ ను హీరోగా పెట్టి ఒక లవ్ స్టోరీ భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని అనుకున్నాడట జక్కన్న కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

Rajamouli Movie Halted With That Hero , Rajamouli Movie , Hero , Rajamouli , D

అయితే ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవడానికి కారణం సూర్యప్రకాష్ నటించిన మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ కావడమే అన్న టాక్ కూడా ఉంది.దీంతో ఇక రాజమౌళి సూర్యప్రకాష్ తో సినిమా తీయాల్సి ఉన్నప్పటికీ చివరికి అది మధ్యలోనే ఆగిపోయింది.అంతకు ముందు కన్నడ మెగా స్టార్ మోహన్ లాల్ తో కూడా ఓ సినిమా తీయాలని ఎంతో సంప్రదింపులు జరిపినా.

అది కూడా కుదరలేదట.సినిమాలు పక్కకు తప్పుకున్న తర్వాత మళ్లీ తనకు కలిసి వచ్చిన హీరో ఎన్టీఆర్ తోనే సింహాద్రి సినిమా తీసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు రాజమౌళి.

ఇకపోతే ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా మార్చి 25 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది అన్న విషయం తెలిసిందే.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు