వేసవి తాపానికి రైలు పట్టాలు కాలిపోతున్నాయి.. చూడండి!

అదేంటి వేసవి కాలం పోయి చాలా రోజులు అవుతోంది.ఇపుడు వేసవి తాపానికి రైలు పట్టాలు కాలిపోవడం ఏమిటి అని అనుకుంటున్నారా? ఇక్కడ చెప్పబోయేది మన గురించి కాదండీ.

ఇది ఇంగ్లాండ్ లో చోటు చేసుకున్న ఓ ఘటన తాలూకా ఘట్టం.

అక్కడ భానుడి భగభగలకు.ఏకంగా రైలు పట్టాలే కాలిపోయాయి.వాండ్స్‌వార్త్‌ రోడ్‌, లండన్‌ విక్టోరియా మధ్య సోమవారం ఈ ఘటన చోటు చేసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ విషయాన్ని సౌత్‌ఈస్ట్రన్‌ రైల్వే ఎండీ స్టీవ్‌ వైట్ ట్విటర్‌ ద్వారా ప్రకటించగా వెలుగు చూసింది.అయితే సకాలంలో సిబ్బంది అప్రమత్తం అవడంతో పెనుప్రమాదం తప్పింది.

ఇక స్టీవ్‌ ట్వీట్‌కు.సిబ్బంది కూడా స్పందించారు.

Advertisement

రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు సవాల్‌గా మారనున్నాయని తెలిపారు.పట్టాలపై మరీ పొడి వాతావరణం ఉండడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనావేసి చెప్తున్నారు.

ఇకపోతే UKలో 34 డిగ్రీల సెల్సియస్‌ దాటుతున్నాయి.ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి ప్రమాదాలు జరగడం సహజమే.

అయితే మన ఇండియాలో అలాంటి ఘటనలకు తావులేదు.బేసిగ్గా ఇండియా వాతావరణం అనేది సమతుల్యంగా ఉంటుంది.

కాబట్టి అలాంటి సంఘటనలు ఈ దశాబ్దకాలంలో జరిగినట్టు దాఖలాలు లేవు.అంతకు మునుపు కూడా అలాంటివి ఇక్కడ జరిగినట్టు కూడా ఆధారాలేమీ లేవు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!

అందుకే మన భారత దేశాన్ని చూసి ఫారినర్స్ ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు.ఏదో శక్తి ఇక్కడ ఉందని వారు నమ్ముతారు.

Advertisement

ఇక మన పురాణాలు కూడా చెబుతున్నది ఏమంటే భారత్ వేదభూమి అని.ఇక్కడ ప్రకృతి చాలా నిలకడగా ఉంటుందని చెబుతూ వుంటారు.