మరోసారి కేంద్రంపై ఫైర్ అయిన రాహుల్!

తొలి రోజు పార్లమెంట్ సమావేశంలో వలస కార్మికుల మరణాలకు సంబంధించి ప్రభుత్వం వద్ద సమాచారం లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ లోకసభలో తెలిపారు.

ఇక దీనిపైన రియాక్ట్ అయిన రాహుల్ గాంధీ.

లాక్ డౌన్‌లో ఎంతమంది ఉపాధి కోల్పోయారో? చనిపోయారో ప్రపంచం మొత్తానికి తెలిసిన కాని మోదీ ప్రభుత్వానికి మాత్రం అసలు తెలీలేదు.వలస కూలీలు ప్రాణాలు పోతున్న ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు అంటూ రాహుల్ గాంధీ కేంద్రాన్ని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

Rahul Gandhi Attacks Modi Govt Over Deaths Of Migrant Workers, Rahul Gandhi ,Con

ఇక దీనిపైన స్పందించిన బిజేపి నాయకులు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు.మన దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అమెరికా తరహా వైద్య వసతులను మన దేశంలో ఎందుకు కల్పించలేకపోయిందనే అనే అంశంపై స్పందించని రాహుల్ గాంధీ పగలు రాత్రి తేడా లేకుండా మా పార్టీని విమర్శిస్తుంటారు అయిన వలస కూలీలను అటు మహారాష్ట్రలో ఇటు ఢిల్లీలో రెచ్చగొట్టింది మీరు కాదా అంటూ బిజేపి నాయకులు రాహుల్ ను ప్రశ్నిస్తున్నారు మరి దీనిపై రాహుల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు