'మోడీ 2.0' 100 డేస్‌పై రాహుల్‌ స్పందన

కేంద్రంలో వరుసగా రెండవ సారి అధికారంలోకి వచ్చిన మోడీ అండ్‌ కో 100 రోజులు పూర్తి చేసుకుంది.

గత టర్మ్‌లో ఎన్నో సంచలన నిర్ణయాలను తీసుకున్న నరేంద్ర మోడీ రెండవ టర్మ్‌లో కూడా ఏమాత్రం తగ్గకుండా దూసుకు పోతున్నాడు.

ఈ సారి ఈ వంద రోజుల్లో జరిగిన అతి పెద్ద విప్లవాత్మక నిర్ణయం కాశ్మీర్‌ విషయం.ఆర్టికల్‌ 370 ని రద్దు చేయడం అనేది దేశ వ్యాప్తంగా ఆపార్టీకి మరియు మోడీ అమిత్‌ షాల ద్వయంకు పేరును తెచ్చి పెట్టింది.

ఇక బీజేపీ రెండవ దఫా 100 రోజుల పాలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.రాహుల్‌ గాంధీ ఈ వంద రోజుల్లో మోడీ ప్రభుత్వం ఏమాత్రం బాగా పరిపాలన కొనసాగించలేదని అన్నాడు.
ఇంకా రాహుల్‌ మాట్లాడుతూ.

ఈ వంద రోజుల్లో దేశం ఎలాంటి ప్రగతిని సాధించలేదని అన్నాడు.ప్రజాస్వామ్యంను అణుగదొక్కేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement

మీడియా గొంతును నొక్కడంతో పాటు ప్రతిపక్షాలను కక్ష సాధించేందుకు ఎక్కువగా సమయం కేటాయించినట్లుగా అనిపిస్తుందని ఈ సందర్బంగా రాహుల్‌ అన్నాడు.పలు కంపెనీలు ప్రమాదంలో పడటంతో పాటు, యువత నిరుద్యోగంతో తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు.

నిజాలు దాచి అబద్దాలు ప్రచారం చేస్తూ నాటకాలు ఆడుతున్నారంటూ కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు.ఇంకా పలువురు కాంగ్రెస్‌ నాయకులు బీజేపీ 100 రోజుల పరిపాలనపై విమర్శలు గుప్పించారు.

Advertisement