రాహుల్ గాంధీ అరెస్ట్!

హద్రస్ అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు కాలినడకన వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని గురువారం గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై అదుపులోకి తీసుకున్నారు.

హద్రస్ కు శాంతియుతంగా కాలినడకన వెళ్తున్న వాళ్ళను నాయకులను అనవసరంగా అడ్డుకున్నారని కాంగ్రెస్ పేర్కొంది.

అంతకుముందే బయలుదేరిన రాహుల్, ప్రియాంక లను యూపీ పోలీసులు పరి చెక్ పోస్టు వద్ద అడ్డుకున్నారు.దాంతో, పార్టీ నేతలు మరియు కార్యకర్తలతో హద్రస్ కు వెళ్లాలని రాహుల్ మరియు ప్రియాంక నిర్ణయించారు, రాహుల్ ను అడ్డుకుంటున్న క్రమంలో ఆయన కింద పడ్డారు, దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

తల్లిదండ్రులను అంత్యక్రియల్లో పాల్గొననివ్వకూడదని ఏ గ్రంధం లో రాసి ఉందని యోగి ఆదిత్యనాథ్ పై ప్రియాంక గాంధీ మండిపడ్డారు.కాంగ్రెస్ నాయకుల పర్యటనతో హద్రస్ లో 144 సెక్షన్ విధించిన పోలీసులు.

కోవిడ్ నిబంధలను ఉల్లంఘించినందుకు వారి పై కేసులు నమోదు చేశామని కమిషనర్ లవ్ కుమార్ తెలిపారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్త్రీల పై జరుగుతున్న అత్యాచారాలపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది.

Advertisement

మరి ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

Advertisement

తాజా వార్తలు