సీఎం జగన్ కు మరోసారి లేఖ రాసిన వైసీపీ రెబల్ ఎంపీ

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొద్ది రోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు తాజాగా కోవిడ్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది.

దీని పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

హిందువుల మనోభావాలను హిందువుల మత పెద్దలను సంప్రదించకుండా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇలాంటి ప్రకటన చేయడం చాలా బాధాకరమని ఆయన సీఎం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.ఒక బాధ్యతగల పార్లమెంట్ సభ్యునిగా హిందూ ప్రజల మనోభావాలను మీకు తెలియజేయడం వాటిని మీ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత అందుకే ఈ లేఖను రాస్తున్నాను.

YCP MP Raghurama Krishnam Raju Writes A Letter To Jagan, Permissions For Celebra

రాష్ట్రంలో జరిగే వివాహాలకు ఇతర శుభకార్యాలకు నిబంధనలతో కూడిన అనుమతులను ఇస్తున్న ప్రభుత్వం.అవే నిబంధనలను వినాయక చవితి బహిరంగ వేడుకలకు వర్తింపజేసి వినాయక మండపాలకు అనుమతులివ్వాలని అలాగే ఈ విషయంలో మీరు ఒకసారి పునరాలోచించాలని కోరుతున్నాను.

రాష్ట్రంలో హిందువుల మనోభావాలను గౌరవించి వినాయక మండపాల అనుమతి విషయంలో మీరు పునరాలోచిస్తారని ఆశిస్తున్నా అంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు లేఖలో పేర్కొన్నారు.

Advertisement
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

తాజా వార్తలు