మలయాళీ ప్రేక్షకులకు పుష్ప ది రూల్ నచ్చలేదా.. కలెక్షన్లు తగ్గడానికి కారణాలివేనా?

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) గురించి మనందరికి తెలిసిందే.

అల్లు అర్జున్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు.

అందులో భాగంగానే తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 లో( Pushpa 2 ) నటించారు.అయితే తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ఇకపోతే అల్లు అర్జున్ కి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో( Kerala ) ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.

అల్లు అర్జున్ ఫ్లాప్ మూవీ అయిన హ్యాపీ సినిమాను మలయాళం లో( Malayalam ) డబ్ చేసి రిలీజ్ చేయగా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

Pushpa The Rule Is Not Liked By The Malayali Audience These The Reasons For The
Advertisement
Pushpa The Rule Is Not Liked By The Malayali Audience These The Reasons For The

ఆ తర్వాత చాలా సినిమాలు అక్కడ మంచి వసూళ్లు సాధించాయి.మాలీవుడ్ స్టార్ లతో సమానంగా అక్కడ ఫాలోయింగ్ సంపాదించాడు అల్లు అర్జున్.ఇక చివరి సినిమా పుష్ప కూడా మలయాళంలో చాలా బాగా ఆడింది.

దీంతో తెలుగుతో పాటు కేరళలో కూడా ఈ పుష్ప 2 మూవీ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ప్రమోషన్ల టైంలో కేరళలో తన గడ్డ అని చెబుతూ.

తాను ఆ రాష్ట్రానికి దత్త పుత్రుడినని తెలిపారు.ఈ సినిమాకు అక్కడున్న హైప్ చూసి డిస్ట్రిబ్యూటర్ కూడా భారీ వసూళ్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.

పుష్ప 2 మూవీతో బద్దలు కొడతామని ధీమా వ్యక్తం చేశాడు.కానీ పుష్ప2 సినిమా కేరళలో అనుకున్నంతగా ప్రభావం చూపట్లేదు.తొలి రోజు ఈజీగా పది కోట్ల గ్రాస్ మార్కును దాటేస్తుందని అంచనా వేయగా ఊహించని విధంగా రూ.6 కోట్ల వసూళ్లే వచ్చాయి.రెండో రోజు వసూళ్లు సగానికి పడిపోయాయి.

Pushpa The Rule Is Not Liked By The Malayali Audience These The Reasons For The
సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

సినిమాకు మామూలుగా డివైడ్ టాక్ ఉండగా కేరళలో ఇంకొంచెం ఎక్కువ నెగెటివ్ టాక్ వచ్చింది.ఇక మలయాళ ప్రేక్షకులు కొంచెం సున్నితంగా ఉంటారు.అక్కడి సినిమాలు అంతా వాళ్లకు మరీ ఇంత మాస్ కంటెంట్ ఇచ్చేసరికి సానుకూల స్పందన కనిపించట్లేదు.

Advertisement

హిందీ రూరల్ ఆడియన్సుని, తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సినిమాను ఊర మాస్‌గా తీర్చిదిద్దారు.కానీ మలయాళీలకు మాత్రం ఇది రుచిస్తున్నట్లు కనిపించడం లేదు.ఫాహద్ ఫాజిల్( Fahadh Faasil ) పాత్రను ప్రెజెంట్ చేసిన తీరు కూడా వాళ్లకు నచ్చుతున్నట్లు లేదు.

అయితే విజయ్ నటించిన లియో సినిమాతో అల్లు అర్జున్ పోటీ పడగా ఆ సినిమా సాధించిన దాంట్లో కనీసం సగం కూడా సాధించలేకపోయింది పుష్ప మూవీ.

తాజా వార్తలు