జనగణమన కోసం హీరోయిన్ ను లాక్ చేసిన పూరీ..ఈసారి కూడా బిటౌన్ బ్యూటీనే..

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా లైగర్.

ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా కోసం విజయ్ కూడా చాలా కష్ట పడుతున్నాడు.

ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ ను మేకర్స్ విజయవంతంగా పూర్తి చేసి ఆగస్టు 25న రిలీజ్ చేయడానికి అంతా సిద్ధం చేసారు.ఇక ఈ సినిమా తర్వాత వెంటనే పూరీ గ్యాప్ లేకుండా తన నెక్స్ట్ సినిమా జనగణమన పై కూడా కీలక అప్డేట్ ఇచ్చాడు.

జనగణమన సినిమాను గతంలోనే మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కాల్సి ఉంది.కానీ ఇప్పుడు పూరీ ఈ సినిమాను కూడా విజయ్ దేవరకొండ తోనే చేస్తున్నాడు.లైగర్ రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమాను కూడా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.ఈ సినిమాలో కూడా బాలీవుడ్ బ్యూటీ నే లాక్ చేసినట్టు తెలుస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.మేకర్స్ అప్పుడే సంప్రదింపులు కూడా మొదలు పెట్టారట.సినిమాకు పాన్ అప్పీల్ తేవాలంటే అక్కడ ఇక్కడ మంచి పేరు ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుంది అని ఆలోచించి ఈ సినిమాలో కియారా ను లాక్ చేయాలనీ చూస్తున్నారు.

ఈమె ప్రెసెంట్ రామ్ చరణ్ కు జోడీగా ఆర్సీ15 లో హీరోయిన్ గా నటిస్తుంది.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు