Puri Jagannadh : వారానికి యాభై రూపాయలు సంపాదించడానికి పూరి జగన్నాథ్ ఆ పని చేసావాడట….!

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా పేరు తెచుకున్నవాళ్లంతా కష్టపడి పైకొచ్చినవారే.ఇండియాస్ టాప్ డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి ( S.

 Puri Jagannadh About His Early Days Struggles-TeluguStop.com

S.Rajamouli )కూడా ఒకప్పుడు ఖాళీ ఖాళీగా తిరుగుతూ టైం వేస్ట్ చేసేవాడట.ఆ తరువాత చాలా డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ గా చేసాడు.తరువాత కొన్నాళ్ళు సీరియల్స్ కూడా డైరెక్ట్ చేసాడు.ఇలా ప్రతి పెద్ద డైరెక్టర్ సక్సెస్ స్టోరీ వెనుక ఒక విషాద కథ ఉంటుంది.ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో హీరోలతో సమానంగా ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్.

బద్రి,( Badri ) పోకిరి, ఇడియట్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చి, స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న పూరి కథ కూడా ఇలాంటిదే.ఈయన డైరెక్టర్ అవ్వకముందు అనేక చోట్ల పనిచేసాడు.

Telugu Badri, Idiot, Pokiri, Puri Jagannadh, Rajamouli, Tollywood-Movie

మనం సినిమా క్రెడిట్స్ చూసేటప్పుడు గమనిస్తే కొన్ని సార్లు స్టోరీకి ఒకరి పేరు, డైరెక్షన్ కి మరొకరి పేరు వేస్తుంటారు.ఇలాగె పూరి జగన్నాథ్ కూడా చాలా కథలు రాసేవాడట.కానీ ఏ కథకు ఆయనకు క్రెడిట్ ఇచ్చేవారు కాదట.ఒక సీన్ రాస్తే 100 రూపాయలు ఇచ్చేవారట.అలాగే చాలాసార్లు చిన్న చిన్న సీన్ లు డైరెక్షన్ కూడా చేసేవాడట.ఒక్కో సీన్ కి 1000 రూపాయలు ఇచ్చేవారట.

ఇలా ఆయన క్రెడిట్ తీసుకోకుండా చేసిన వర్క్ చాలానే ఉంది.

Telugu Badri, Idiot, Pokiri, Puri Jagannadh, Rajamouli, Tollywood-Movie

కేవలం రైటింగ్, డైరెక్షన్ మాత్రమే కాదండి.మన పూరి జగన్నాథ్ ( Puri jagannadh )మంచి ఆర్టిస్ట్ కూడా.అప్పట్లో ఒక పాపులర్ మ్యాగజిన్, ప్రతీవారం ఒక ఆనిమేటెడ్ షార్ట్ స్టోరీని ప్రింట్ చేసేది.

వారి దగ్గరకు వెళ్లి నేను ఆర్టిస్టుని అని చెప్తే వారు ఒక కథను ఇచ్చేవారట.ఆ కథకు అనుగుణంగా బొమ్మలు గీసి ఇవ్వాలి.ఒక్కో కథకు 50 రూపాయలు ఇచ్చేవారట.పూరి జగన్నాథ్ వారానికి ఒక కథకు బొమ్మలు గీసేవాడట.

ఇలా బొమ్మలు గీస్తూ కొంతకాలం వారానికి 50 రూపాయలు సంపాదించేవాడట.మనం ఎంతగానో అభిమానించే ఈ స్టార్ డైరెక్టర్లో ఇంకా ఏమేం కళలు దాగి ఉన్నాయో!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube