చిన్నపిల్ల నుంచి క్యాండీ కొట్టేసిన కుక్కపిల్ల.. వీడియో వైరల్!

సోషల్ మీడియాలో వైరలయ్యే కొన్ని వీడియోలు చూస్తే నవ్వు రాక తప్పదు.తాజాగా అలాంటి ఒక వీడియో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఒక చిన్న కుక్క పిల్ల ఒక దొంగతనం చేసింది.ఇది చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

చిలిపి కుక్కపిల్ల అని కామెంట్లు పెడుతున్నారు.పూబిటీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల కొద్దీ లైకులు వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియో లో ఒక నల్ల కుక్క పిల్ల చిన్నారి వెంటపడటం చూడొచ్చు.ఆ కుక్క పిల్ల చిన్నారి కాళ్లకు ధరించిన బూట్స్‌ను కొరుకుతూ అల్లరి చేసింది.

Advertisement

అయితే ఈ కుక్క అల్లరి భరించలేక ఆ బాలిక వేగంగా నడవటం మొదలు పెట్టింది.అయితే కుక్క అల్లరి బాగా ఎక్కువ అవడంతో తన చేతి తో దానిని కొట్టాలని చిన్నారి చూసింది.

అదే చేతిలో ఆమె ఒక లాలీపాప్ పట్టుకుని ఉంది.ఈ క్రమంలోనే ఆ లాలీపాప్ కాస్త కుక్క నోటి వద్దకు వచ్చింది.

దీంతో అదే అదునుగా భావించి ఆ లాలీపాప్ ను కుక్క పిల్ల గుటుక్కున నోట కరుచుకుంది.ఆ పుప్పి లాలీ పాప్‌ని పట్టుకొని ఎవరికీ దొరకకుండా వేగంగా పరుగెత్తింది.

అయితే తనకిష్టమైన క్యాండీని కుక్క ఎత్తుకెళ్ళడంతో చిన్నారి బాగా ఏడుస్తూ కనిపించింది.

ఆ నటుడు ఒక్క డైలాగ్ లోని పదానికి పారితోషికం 15 లక్షలట

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు."కుక్క నైనా సరే, ఇంకా ఎవరినైనా సరే నమ్మకూడదు. చిన్నారి తన క్యాండీని జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది.

Advertisement

ఇప్పుడు ఈ బాలికకు ఈ విషయం బాగా అర్థం అయినట్లు ఉంది" అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.అయ్యో పాపం అని మరికొంత మంది నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు.

ఈ ఫన్నీ వీడియో ని మీరు కూడా చూసేయండి.