భారత సంతతికి చెందిన విద్యావేత్త, రాజకీయవేత్త, కమ్యూనిటీ నేత రాజ్ పన్ను( Raj Pannu ) కెనడాలో కన్నుమూశారు.ఆయన వయసు 91 సంవత్సరాలు.
జనవరి 30న ఆల్బెర్టాలోని ఎడ్మాంటన్‌లో ( Edmonton, Alberta )ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.1934లో భారత్‌లోని పంజాబ్‌లో జన్మించిన రాజ్ పన్ను.1962లో కెనడాకు వలస వెళ్లి ఆల్బెర్టాలోని వైట్‌కోర్ట్‌లో స్థిరపడ్డారు.1964 వరకు స్థానిక పాఠశాలలో టీచర్‌గా పనిచేశారు.దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా ఆయన విద్యా జీవితం కొనసాగింది.1973లో ఆల్బెర్టా యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో పీహెచ్‌డీ అందుకున్న రాజ్ పన్ను.దీనికి ఏడాది ముందు యార్క్ యూనివర్సిటీలో ( York University )బోధించాడు.1969లో ఆయన ఫుల్ టైం ఫ్యాకల్టీ సభ్యుడిగా మారారు.1996లో విద్యా రంగం నుంచి ఆయన పదవీ విరమణ చేశారు.
అనంతరం రాజకీయాల్లోకి దిగిన ఆయన 1997లో ఎడ్మాంటన్ స్ట్రాత్‌కోనా స్థానానికి ( Edmonton to Strathcona location )ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఆ స్థానంలో 2008 వరకు కొనసాగిన రాజ్ పన్ను .2000లో ఆల్బెర్టా న్యూ డెమొక్రాటిక్ పార్టీ నేతగా ఎన్నికై 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు.కెనడాలోని ప్రధాన రాజకీయ పార్టీకి నాయకత్వం వహించిన దక్షిణాసియా సంతతికి చెందిన తొలి కెనడియన్లలో ఒకరిగా రాజ్ పన్ను నిలిచారు.
తన పదవీ కాలంలో ప్రజారోగ్యం, విద్యకు రాజ్ పన్ను గట్టి మద్ధతుదారుగా నిలవడంతో పాటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం వినిపించారు.శాసనసభలో ఆయన చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగాలు, నిరసనలు పన్నూని ఆల్బెర్టా రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా మార్చాయి.ప్రభుత్వ విద్య పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఆల్బెర్టా టీచర్స్ అసోసియేషన్ నుంచి గుర్తింపు పొందారు.
ఫోర్ట్ ఎడ్మాంటన్ పార్క్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడిగా, సిటిజన్స్ ఫర్ క్వాలిటీ కమ్యూనిటీస్‌లో చురుగ్గా పాల్గొన్నారు రాజ్ పన్ను.ప్రొగ్రెసివ్ పీపుల్స్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్మాంటన్‌లో ఆయన కీలక వ్యక్తి.
గదర్ ఉద్యమంతో పాటు చారిత్రక, సామాజిక సమస్యలపై ప్రచురణలకు రాజ్ పన్ను ఎంతో సహకరించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy