చిరంజీవికి కరోనా కష్టాలు.. క్వారంటైన్ లో ఉండాలట!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి.కొన్ని రోజుల క్రితం చిరంజీవి ఆచార్య షూటింగ్ లో పాల్గొనాలని కరోనా పరీక్ష చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

 Public Health Director Srinivaasa Rao Comments On Chiranjeevi Quarantine,chiranj-TeluguStop.com

అయితే పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో మరో మూడు చోట్ల చిరంజీవి కరోనా పరీక్షలు చేయించుకున్నారు.అయితే ఊహించని విధంగా ఆ మూడు పరీక్షల్లో నెగిటివ్ నిర్ధారణ అయింది.

ఫాల్టీ కిట్ వల్ల కరోనా సోకకపోయినా సోకిందని తప్పుడు రిపోర్ట్ వచ్చినట్టు చిరంజీవి భావించారు.దీంతో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆచార్య షూటింగ్ లో పాల్గొనాలని చిరంజీవి భావిస్తున్నారు.

అయితే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు మాత్రం పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా చిరంజీవి క్వారంటైన్ లో ఉండాలని సూచనలు చేశారు.ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం ఒకసారి పాజిటివ్ నిర్ధారణ తరువాత నెగిటివ్ వచ్చినా క్వారంటైన్ లో ఉండాలని తెలిపారు.

శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.ఏ కరోనా టెస్ట్ చేయించుకున్నా వైరస్ సోకిందో లేదో నూటికి నూరు శాతం నిర్ధారణ కాదని ఒకసారి పాజిటివ్ గా నిర్ధారణ అయిన తరువాత లక్షణాలు ఉన్నా లేకపోయినా, తరువాత పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా క్వారంటైన్ లో తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.

చిరంజీవి క్వారంటైన్ లో ఉండటంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.

వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చిరంజీవి ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

సింగిల్ షెడ్యూల్ లో ఆచార్య పూర్తి చేయడానికి చిరంజీవి సిద్ధమైన తరుణంలో చిరంజీవి క్వారంటైన్ లో ఉంటే ఆచార్య సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube