మహేష్ బాబు జక్కన్న సినిమాలో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్.. ఆ హీరో చాలా లక్కీ అంటూ? 

దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా ఎంతో పాపులర్ అయ్యాడు.

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు సైతం రాజమౌళి డైరెక్షన్ ని ఎంతగానో ప్రశంసించారు.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఒక బిగ్గెస్ట్ అడ్వెంచర్స్ మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమాని ముందు సినిమాల కంటే భిన్నంగా మరింత భారీగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

అంతేకాకుండా ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పనిచేస్తున్నట్లు తెలిసింది.అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో మరొక స్టార్ హీరో కూడా భాగం అయినట్లు తాజాగా ఒక న్యూస్ రిలీజ్ అయింది.

ఇంతకీ ఆ హీరో ఎవరంటే సలార్ సినిమాలో ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండ్ గా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ).వరదరాజమన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ నటుడు ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగం కావటం పట్ల తెలుగు ప్రేక్షకులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Advertisement

ఈ సినిమాలో పృధ్విరాజ్ సుకుమారన్ అత్యంత పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నాడట, అంతేకాదు మహేష్ బాబుతో సమానమైన పాత్ర అని తెలిసింది.అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అనే విషయం మూవీ టీం అధికారికంగా ప్రకటించవలసి ఉంది.ఈ సినిమాని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.

దీనికి కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు.ఇందులో ప్రముఖ స్టార్స్ చాలామంది నటిస్తున్నట్లు సమాచారం.

మూవీకి సంబంధించిన స్టోరీ లైన్ పూర్తిగా లాక్ చేశారు రాజమౌళి.అయితే ఈ సినిమాకి స్టోరీ రైటర్ గా పనిచేసిన విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీ తో రాబోతుందని తెలిపారు అందుకు తగినట్లుగానే మహేష్ బాబు లుక్స్ కూడా టార్జాన్ మాదిరిగా ఉండబోతున్నాయని సమాచారం.ప్రస్తుతం ఈ మూవీ డైలాగ్ రైటింగ్ జరుగుతుంది ఇది పూర్తి అయిన వెంటనే ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని సినీ వర్గాల సమాచారం.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు