కరోనా సెకెండ్ వేవ్ తో నిర్మాతలకు ఎన్ని కోట్ల నష్టం తెలుసా.. ?

సినిమా తీయాలంటే చాలా అంశాలు ముడిపడి ఉంటాయి.ముందు కథ కావాలి.

ఆ కథకు కథనం కావాలి.

దానికి తగిన హీరో కావాలి.

ఆయన పక్కన ఓ హీరోయిన్.సినిమాను రూపొందించేందుకు దర్శకుడు కావాలి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.ఈ సినిమాను నిర్మించేందుకు నిర్మాత కావాలి.

Advertisement

ఈ నిర్మాత పెట్టే డబ్బు మీద ఆధారపడే సినిమా నిర్మాణం కొనసాగుతుంది.చిన్నదైనా, పెద్దదైనా సినిమా తీయాలంటే డబ్బు ఉండి తీరాల్సిందే.

అయితే ఏ సినిమా నిర్మాత అయినా తన జేబు నుంచి డబ్బు తీసి పెట్టడు.ఎక్కడో ఒక చోట నుంచి మనీ అరెంజ్ మెంట్ అనేది ఉంటుంది.

అది కూడా వడ్డీకి తెచ్చి పెడతారు.పెద్ద హీరోల సినిమాలు అయితే.

ఇంకాస్త ఎక్కువ డబ్బు వడ్డీకి తెచ్చి పెట్టాల్సి ఉంటుంది.సినిమా విడుదల అయ్యాక వీలైనంత త్వరగా అప్పు తీర్చే ప్రయత్నం చేస్తారు నిర్మాతలు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

అయితే ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ నిర్మాతల పాలలిట శాపంగా మారింది.తొలి దశలోనే చాలా మంది నిర్మాతలు డబ్బులు తెచ్చి ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

Advertisement

మళ్లీ అప్పు తెచ్చి సినిమా తీద్దాం అనుకుంటుండగానే.రెండో వేవ్ ముంచుకొచ్చింది.

ఇప్పటికే హీరోలకు అడ్వాన్స్‌ లు ఇచ్చి, దర్శకులకు డబ్బులిచ్చి సినిమాలు మొదలుపెట్టారు.ప్రస్తుతం షూటింగులు ఆగిపోయాయి.సినిమాలు చేయలేక, అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు నిర్మాతలు.

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం చిరంజీవి ఆచార్య, బాలకృష్ణ అఖండ, వెంకటేశ్‌ నారప్ప, ఎఫ్‌ 3 , జూ.ఎన్టీఆర్ -రామ్‌చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ , ప్రభాస్‌ రాధే శ్యామ్‌ సినిమాలు తెరకెక్కుతున్నాయి.ఈ సినిమాలకు ఓ రేంజిలో బడ్జెట్ పెడుతున్నారు.

అయితే సినిమా విడుదల డేట్లు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.దీంతో వడ్డీలు భారీగా పెరుగుతున్నాయి.

ఏం చేయాలో తోచక నిర్మాతలు అవస్థలు పడుతున్నారు.కరోనా మహమ్మారి త్వరగా వెళ్లిపోవాలని కోరుకోవడం తప్ప చేసేదేమీ లేదనుకుంటున్నారు సినీ జనాలు.

తాజా వార్తలు