నాని జెర్సీ సినిమా కలెక్షన్ల వివాదంపై స్పందించిన నాగ వంశీ.. రోడ్డు మీద ఎందుకు పెట్టాలంటూ?

ఏదైనా ఒక సినిమా విడుదల చేయాలి అంటే దర్శక నిర్మాతలు సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తేనే ఆ సినిమా అందరికీ చేరుకుంటుంది.ఈ క్రమంలోనే ఎన్నో ప్రెస్ మీట్లను నిర్వహిస్తూ ఉంటారు.

 Producer Nagavamshi React On Jersy Movie Collections , Nagavamshi , Nani, J-TeluguStop.com

అయితే ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా కొంతమంది రిపోర్టర్లు హీరోలను టార్గెట్ చేస్తూ కాస్త ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలను వేస్తుంటారు.తాజాగా ఇలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నతో సతమతమయ్యారు నటుడు నాని.

త్వరలోనే నాని( Nani )హాయ్ నాన్న( Hai Nanna ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Hai Nanna, Jersy, Nagavamshi, Nani, Shyam Singarai, Tollywood-Movie

ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించడంతో కొందరు విలేకరులు నానిని ఇబ్బందికర ప్రశ్నలు వేశారు.ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ నానిని ప్రశ్నిస్తూ మీ గత సినిమాలు జెర్సీ( Jersey ) శ్యాం సింగరాయ్ ( Shyam Singarai) వంటి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ కాలేదట, హాయ్ నాన్న లాంటి సినిమాలు ఎలా చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు నాని కూడా కాస్త ఇబ్బందిగానే ఇప్పుడు గత సినిమాల కలెక్షన్ల గురించి ప్రస్తావన ఎందుకు అయినా నా నిర్మాతలు కలెక్షన్ల విషయంలో సంతృప్తిగా ఉన్నారు అంటూ నాని సమాధానం చెప్పుకొచ్చారు.

Telugu Hai Nanna, Jersy, Nagavamshi, Nani, Shyam Singarai, Tollywood-Movie

ఇలా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నానికి ఇలాంటి ప్రశ్న ఎదురు కావడంతో ఈ సినిమా నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో తాము చాలా సంతృప్తిగా ఉన్నాము అంటూ ట్వీట్లు చేశారు.ఇకపోతే సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత నాగ వంశీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ వివాదం గురించి కాస్త ఘాటుగానే స్పందించారు.ఈ సందర్భంగా నాగ వంశీ ( Nagavamshi ) మాట్లాడుతూ జెర్సీ రిజల్ట్ తో నేను సంతృప్తిగా ఉన్నాను.

ఆ సినిమా ఆర్ధిక లావాదేవీలతో మీకు ఏంటి సంబంధం. కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అంతా పూర్తిగా నిజం కాదు.అయినా మా వ్యాపారం గురించి అడిగితే మేము ఎందుకు చెబుతాం.మేము ఎందుకు దానిని రోడ్డు మీద పెట్టాలి.

అలా పెట్టలేం కదా.ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలిసి ప్రెస్ మీట్ లలో హీరోలను ఇబ్బంది పెట్టడం ఏంటి అంటూ ఈ సందర్భంగా నాగ వంశీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube