ఈ నెల 30వ తేదీన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
ఈ ఎన్నికలలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు ప్యానెల్, సి కళ్యాణ్ ప్యానెల్ పోటీ పడబోతున్నాయి.
సి.కళ్యాణ్( C kalyan ) అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు.ఇప్పటి వరకు దిల్ రాజు ప్యానెలే అధికారంలో ఉంది.
మరోవైపు, ఫిల్మ్ ఛాంబర్‌కు సమాంతరంగా గిల్డ్ ఏర్పాటు చేసి దానిలో 27 మంది నిర్మాతలు ఉన్నారు.అయితే, గిల్డ్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చి ఫిల్మ్ ఛాంబర్‌ను పట్టించుకోవడం మానేశారని సి.కళ్యాణ్ ఆరోపించారు.ఈ మేరకు ఆయన తాజాగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్‌లో సి.కళ్యాణ్ మాట్లాడుతూ.దాసరి నారాయణరావు బాటలో నిర్మాతగా, నిర్మాతల మండలిలో చిన్న సభ్యుడిగా ఎదిగానని తెలిపారు.
నిర్మాతల సంక్షేమం కోసం రకరకాలుగా ఆదాయాన్ని సమకూర్చాము.నాలుగు రాష్ట్రాల చిత్ర పరిశ్రమలను కలిపి లీడ్ చేద్దామనుకుంటున్నాము అని కళ్యాణ్ తెలిపారు.ఆయా ప్రభుత్వాల సహకారంతో నాలుగు రాష్ట్రాల పరిశ్రమలకు మంచి చేస్తామని ఆయన అన్నారు.
మొదట నిర్మాతలకు మెడిక్లైమ్ తీసుకొచ్చింది నేనే.మనల్ని కాపీ కొట్టిన కన్నడ ఫిల్మ్ ఛాంబర్( Kannada Film Chamber ) వాళ్లు మెడిక్లైమ్‌ను కొనసాగిస్తున్నారు.
మన దగ్గర లేదు.నిర్మాతల మండలి ఆదాయానికి గిల్డ్ అనే గ్రూపు గండి కొట్టింది.
గత నాలుగేళ్లలో ఫిల్మ్ ఛాంబర్ సర్వనాశనం అయ్యింది.నేను ఈ దఫా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి బలమైన కారణం ఉంది.
గతంలో దిల్ రాజు, దామోదర ప్రసాద్ వచ్చి డిజిటల్ ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెబితే విరమించుకున్నాను.రెండు లక్షల రూపాయలు లేక సినిమా విడుదల ఆగిపోయిన సందర్భాలు నేను ఎదుర్కొన్నాను.
చిన్న సినిమాలు ఆపితే కృష్టానగర్ అకలితో అలమటిస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సి.కళ్యాణ్.ఐదుగురు నిర్మాతలు చిన్న సినిమాలకు మేం ఉన్నామని చెబితే సంతోషించాము.
సినీ పరిశ్రమకు దాసరి( Dasari Narayana Rao ) లాంటి వ్యక్తులు కావాలి.ఎన్నికల్లో ఆ నిర్మాతలు పోటీ చేయరు, ప్రతిపాదిస్తారు, బెదిరిస్తారు.
నేను నాలుగు సినీ పరిశ్రమలను కలపగలనని డైలాగులు చెప్పడం కాదు, ఆచరణ సాధ్యమయ్యే పనులు చేయండి అని తెలిపారు.ఫిల్మ్ ఛాంబర్‌లో ఓటు హక్కు ఉన్నవాళ్లలో 1600 మంది నిర్మాతలు ఉన్నారని సి.కళ్యాణ్ చెప్పారు.ఫిల్మ్ ఛాంబర్‌లో వ్యక్తులకు ఓటు హక్కు ఉండదని, నిర్మాణ సంస్థలకు ఓటు హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.
బ్యానర్ తరపున ప్రతినిధి తన ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు.ఒక నిర్మాతకు ఎన్ని నిర్మాణ సంస్థలు ఉంటే అన్ని ఓట్లు ఉంటాయని వెల్లడించారు.ఫిల్మ్ ఛాంబర్ ఉండగా గిల్డ్ స్థాపించడం కరెక్ట్ కాదని.
ఆ గిల్డ్‌లో ఉన్న 27 మంది సభ్యులు ఛాంబర్‌లోని 1600 మంది నిర్మాతల రక్తం తాగుతున్నారని ఆరోపించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy